Venkatesh: వెంకటేష్ బర్త్ డే స్పెషల్.. వెబ్ సిరీస్ నుంచి వెంకీ పోస్టర్ రిలీజ్ చేసిన నెట్‏ఫ్లిక్స్..

|

Dec 13, 2021 | 3:58 PM

విక్టరీ వెంకటేష్.. ఇప్పటికీ కుర్రహీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఏమాత్రం తగ్గని ఎనర్జీతో వరుస సినిమాలను చేస్తూ.. ఫుల్ జోష్

Venkatesh: వెంకటేష్ బర్త్ డే స్పెషల్.. వెబ్ సిరీస్ నుంచి వెంకీ పోస్టర్ రిలీజ్ చేసిన నెట్‏ఫ్లిక్స్..
Venkatesh
Follow us on

విక్టరీ వెంకటేష్.. ఇప్పటికీ కుర్రహీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఏమాత్రం తగ్గని ఎనర్జీతో వరుస సినిమాలను చేస్తూ.. ఫుల్ జోష్ మీదున్నారు వెంకటేష్.. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో వరుసగా రీమేక్ చిత్రాలను చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. ఇటీవలే నారప్ప, దృశ్యం 2 వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు వెంకటేష్. ఈరోజు వెంకీమామ పుట్టినరోజు సందర్భంగా.. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా.. వెంకీ తదుపరి చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్.. పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‏ఫ్లిక్స్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ నుంచి వెంకటేష్‏కు సంబంధించిన లుక్‏ను విడుదల చేశారు. నెరిసిన జుట్టు, గడ్డం, చెవికి పోగుతో కనిపించిన వెంకీ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఒక పాస్ పోర్ట్ ఫోటో పట్టుకుని ఆచూకీ వెతుకుతున్న వ్యక్తిగా వెంకటేష్ కనిపించారు. అయితే ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ టైటిల్.. అందులో నటించే నటీనటులకు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించలేదు. ఇందులో దగ్గబాటి రానా కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ట్వీ్ట్..

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వెంకటేష్.. ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్‏గా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోలకు మంచి స్పందన వచ్చింది.

Also Read: Samantha: హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స..

Rashmika Mandanna: ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డానన్న నేషనల్ క్రష్ రష్మిక.. ఇంతకు ఏమైందంటే..

Miss Universe : ఇప్పటివరకు ఇండియా తరపున విశ్వ సుందరి పోటీలో పాల్గొన్న భామలు వీరే..