నాని, రామ్‌ క్రిస్మస్‌ వరకు ఆగాల్సిందేనా!

నాని, రామ్‌ క్రిస్మస్‌ వరకు ఆగాల్సిందేనా!

అనుకోకుండా వచ్చిన కరోనాతో అన్ని రంగాల ఆశలు తలకిందులయ్యాయి. ముందుగా వేసుకున్న ప్రణాళిలకలన్నీ దాదాపుగా మారిపోయాయి.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 04, 2020 | 9:30 PM

Tollywood Young Heroes to wait till Christmas: అనుకోకుండా వచ్చిన కరోనాతో అన్ని రంగాల ఆశలు తలకిందులయ్యాయి. ముందుగా వేసుకున్న ప్రణాళిలకలన్నీ దాదాపుగా మారిపోయాయి. ఇక సినిమా రంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా రాకపోయి, లాక్‌డౌన్ లేకపోయి ఉంటే ఈ పాటికి ఎన్నో సినిమాల షూటింగ్‌లు పూర్తి అయిపోయేవి. అంతేనా ఎన్నో చిత్రాలు థియేటర్లలో సందడి చేసేవి. కానీ ఈ వైరస్ కారణంగా చాలా మూవీలు రిలీజ్ అవ్వకుండా ఆగిపోయాయి. అయితే అందులో కొన్ని ఆన్‌లైన్‌లో విడుదల కాగా.. మరికొన్ని రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే కొన్ని మూవీలు మాత్రం ఆన్‌లైన్‌ రిలీజ్‌కి నో చెబుతున్నాయి. ఆ లిస్ట్‌లో టాలీవుడ్‌ నుంచి నాని, సుధీర్‌ నటించిన ‘వి’, రామ్ నటించిన ‘రెడ్’ చిత్రాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ చిత్రాలను థియేటర్లలోనే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా దసరా అనుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో క్రిస్మస్ వరకు వెయిట్ చేయాలని ఈ మూవీల నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలు ఎప్పుడు విడుదల కానున్నాయి..? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

Read This Story Also: మాస్క్‌ల డిస్ట్రిబ్యూషన్‌.. ఛత్తీస్‌ఘడ్‌ పోలీసుల ప్రపంచ రికార్డు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu