మాస్క్‌ల డిస్ట్రిబ్యూషన్‌.. ఛత్తీస్‌ఘడ్‌ పోలీసుల ప్రపంచ రికార్డు

కరోనా వేళ మాస్క్‌లపై అందరిలో అవగాహన కలిగించేందుకు ఛత్తీస్‌ఘడ్‌ పోలీసులు రాఖీ సందర్భంగా సోమవారం ఓ బృహత్తర కార్యానికి

మాస్క్‌ల డిస్ట్రిబ్యూషన్‌.. ఛత్తీస్‌ఘడ్‌ పోలీసుల ప్రపంచ రికార్డు
Follow us

| Edited By:

Updated on: Aug 04, 2020 | 9:13 PM

Chhattisgarh police creates record: కరోనా వేళ మాస్క్‌లపై అందరిలో అవగాహన కలిగించేందుకు ఛత్తీస్‌ఘడ్‌ పోలీసులు రాఖీ సందర్భంగా సోమవారం ఓ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు ఆ కార్యక్రమంతో వారు ప్రపంచ రికార్డును సాధించారు.

వివరాల్లోకి వెళ్తే.. రాయ్‌ఘర్ జిల్లాలోని పోలీసులు సోమవారం ఆరు గంటల్లో 14 లక్షలకు పైగా మాస్క్‌లను పంపిణీ చేశారు. రాయ్‌ఘర్‌ జిల్లా పోలీస్‌ చీఫ్ సంతోష్ కుమార్‌ సింగ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనిపై సంతోష్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ”మాస్క్‌తో రక్షణ అనే పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. సాయంత్రం 3 గంటల లోపు 14.87లక్షల మాస్క్‌లను పంపిణీ చేశాము. దీంతో గోల్డెన్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డులో రాయ్‌ఘర్ పోలీసులు చోటు సాధించారు” అని అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో పోలీసులకు సహాయంగా పలు ఏజెన్సీలు, ఆర్గనైజేషన్లు పాల్గొన్నట్లు సంతోష్‌ సింగ్‌ వెల్లడించారు.

Read This Story Also: అధిక ఫీజులు వసూలు.. మూడు కార్పొరేట్‌ ఆసుపత్రులకు కోవిడ్‌ సేవలు కట్‌