పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‏గా రానున్న అక్కినేని హీరో.. టాలెంటెడ్ డైరెక్టర్‏కు ఓకే చెప్పిన చైతూ..

|

Feb 09, 2021 | 11:22 AM

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగచైతన్యకు జోడీగా ఫిదా ఫేం సాయి పల్లవి నటిస్తుంది.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‏గా రానున్న అక్కినేని హీరో.. టాలెంటెడ్ డైరెక్టర్‏కు ఓకే చెప్పిన చైతూ..
Follow us on

Akkineni Nagachaitanya Upcoming Movie Update: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగచైతన్యకు జోడీగా ఫిదా ఫేం సాయి పల్లవి నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఏప్రిల్ 16న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటింది. తాజాగా నాగచైతన్య మరో ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

‘పెళ్ళి చూపులు’ ఫేం డైరెక్టర్ తరుణ్ భాస్కర్‏తో నాగచైతన్య ఓ సినిమా చేయనున్నట్లుగా సమాచారం. ఈ మేరకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఓ కథను చైతూకి వినిపించడట. కథ నచ్చడంతో చైతూ కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఇందులో నాగచైతన్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‏గా కనిపించబోతున్నాడట. ఇప్పటివరకు చైతూ పోలీస్ ఆఫీసర్‏గా కనిపించనున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా సినిమాలు చేస్తూ.. మరోవైపు నటుడిగానూ అలరిస్తున్నాడు.

Also Read:

హిట్ ఇచ్చిన డైరెక్టర్‏కే విజయ్ మళ్లీ ఛాన్స్ ఇవ్వనున్నాడా ? మళ్లీ ‘మాస్టర్’ కాంబో రిపీట్..