రానా అఫైర్స్‌పై మిహీకా రియాక్షన్ ఏంటంటే.!

సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలలో హీరో, హీరోయిన్ల మధ్య గాసిప్స్ అనేవి సర్వ సాధారణం. మరీ ముఖ్యంగా హీరో ఎలిజిబుల్ బ్యాచిలర్ అయితే అలాంటివి ఎన్నో వస్తాయి.

రానా అఫైర్స్‌పై మిహీకా రియాక్షన్ ఏంటంటే.!
Follow us

|

Updated on: Nov 11, 2020 | 5:53 PM

Rana Daggubati Affairs: సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలలో హీరో, హీరోయిన్ల మధ్య గాసిప్స్ అనేవి సర్వ సాధారణం. మరీ ముఖ్యంగా హీరో ఎలిజిబుల్ బ్యాచిలర్ అయితే అలాంటివి ఎన్నో వస్తాయి. సరిగ్గా అలాగే టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి కూడా అనేక రూమర్స్ వచ్చాయి. నటి త్రిషతో రానా డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై రానా ఎప్పుడూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ తాజాగా ఈ గాసిప్స్ పై తన భార్య మిహీకా ఎలా రియాక్ట్ అయిందన్న దానిపై రానా క్లారిటీ ఇచ్చారు.

”నా మీద మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. వాటిలో అఫైర్స్‌ గురించే ఎక్కువగా ఉన్నాయి. మిహీకా.. హైదరాబాద్‌, ముంబైలలో పెరిగిన అమ్మాయి. తనకు గ్లామర్ ఫీల్డ్‌ గురించి బాగా తెలుసు అందుకే ఇలాంటి వార్తలను తను లైట్‌ తీసుకుంది” అని రానా చెప్పారు. కేవలం అఫైర్స్ గురించే కాదు.. హెల్త్‌ గురించి వచ్చిన రూమర్స్‌ ను కూడా మిహీకా పట్టించుకోలేదని రానా చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం రానా దగ్గుబాటి నటిస్తోన్న ‘విరాటపర్వం’ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. ‘అరణ్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాదు వీటితో పాటు బాబాయ్‌ వెంకటేష్‌తో కలిసి మరో సినిమాలో నటించేందుకు రానా ఓకే చెప్పారు.