
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు (సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు అభిమానులు, సినీ రాజకీయ నాయకులు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కళ్యాణ్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పవన్ ను ఆప్యాయంగా హత్తుకున్న ఫోటోస్ షేర్ చేస్తూ సుధీర్ఘ ట్వీట్ చేశారు. ” సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు. మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది.
ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ.. మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్య చిరంజీవి” అంటూ రాసుకొచ్చారు.
ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..
ఇదిలా ఉంటే.. పవన్ బర్త్ డే సందర్భంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ యూనివర్స్ నుంచి ఈరోజు సాయంత్రం 4.5 గంటలకు అప్డేట్ రివీల్ చేయనున్నట్లు డైరెక్టర్ సుజీత్ పోస్ట్ చేశారు.
ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో… pic.twitter.com/FEFdNToZ9a
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2026
ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..