టైటిల్ తెచ్చిన తంట: నాని వర్సెస్ మెగాభిమానులు

టైటిల్ తెచ్చిన తంట: నాని వర్సెస్ మెగాభిమానులు

తన 24వ చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ నాచురల్ స్టార్ నాని ఓ వీడియోను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మెగాభిమానుల నుంచి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్‌ను తీసుకోవడంపై కొందరు మెగాభిమానులు నానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలను నాని దెబ్బతీశాడని వారు అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో నిలిచిపోయే చిత్రాలలో ‘గ్యాంగ్‌లీడర్’ ఒకటి. ఈ సినిమాను చరణ్‌తో రీమేక్‌ చేయించాలని మెగాభిమానులు ఎప్పటినుంచో కోరుతున్నారు. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 25, 2019 | 12:54 PM

తన 24వ చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ నాచురల్ స్టార్ నాని ఓ వీడియోను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మెగాభిమానుల నుంచి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్‌ను తీసుకోవడంపై కొందరు మెగాభిమానులు నానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలను నాని దెబ్బతీశాడని వారు అంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో నిలిచిపోయే చిత్రాలలో ‘గ్యాంగ్‌లీడర్’ ఒకటి. ఈ సినిమాను చరణ్‌తో రీమేక్‌ చేయించాలని మెగాభిమానులు ఎప్పటినుంచో కోరుతున్నారు. అయితే ఆ రీమేక్‌ సెట్ అవ్వకుండానే నాని టైటిల్‌ను తీసుకోవడంపై వారు ఫైర్ అవుతున్నారు.

నిజానికి చెప్పాలంటే టైటిల్ హక్కులు నిర్మాత దగ్గర ఉంటాయి. ఆ నిర్మాతను ఒప్పించి టైటిల్‌ను తీసుకునే హక్కు ఏ హీరోకు అయినా ఉంది. కానీ చిరు సినిమా టైటిల్‌లు, పాటలు, సీన్లతో మెగాభిమానులకు ఒక ఎమోషనల్ బాండ్ ఉంటుంది. అందుకే వాటిని మెగా హీరోలు తప్ప ఎవరూ తీసుకున్న వారు అంత ఈజీగా ఒప్పుకోరు. ఇలాంటి సమయంలో నాని మెగాస్టార్ హిట్ టైటిల్‌ను తీసుకోవడం వారిని ఆగ్రహానికి గురిచేసింది.

ఇదిలా ఉంటే మరికొందరు మెగాభిమానులు నానికి సపోర్ట్ ఇస్తున్నారు. టైటిల్‌ను రివీల్ చేసేటప్పుడు చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకొని నాని ఓ పోస్ట్ చేశాడు. ఓ అభిమానిగా ఆయన టైటిల్‌ను రివీల్ చేయడం గర్వంగా ఉందని నాని పోస్ట్ చేశాడు. దీంతో కొందరు మెగాభిమానులు నానికి సపోర్ట్ చేస్తున్నారు. ఆ టైటిల్‌కు నాని న్యాయం చేయగలడని వారు అంటున్నారు. మరి ఈ వివాదం త్వరలో ముగుస్తుందేమో చూడాలి. కాగా ఈ మూవీకి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu