ఆ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో నేను నటించడం లేదు: మనోజ్ బాజ్‌పేయ్‌

ఎన్‌కౌంటర్‌లో మరణించిన మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేపై బాలీవుడ్‌లో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు.

ఆ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో నేను నటించడం లేదు: మనోజ్ బాజ్‌పేయ్‌

Updated on: Jul 11, 2020 | 6:09 PM

ఎన్‌కౌంటర్‌లో మరణించిన మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేపై బాలీవుడ్‌లో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో వికాస్‌ దూబే పాత్రలో విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పేయ్‌ నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ పుకార్లు కాస్త ఈ నటుడి దగ్గరకు చేరగా.. సోషల్ మీడియాలో దీనిపై స్పందించారు మనోజ్‌. ఇది అబద్ధపు వార్త అంటూ ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు.

కాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గత వారం ఎనిమిది పోలీసులను చంపిన కేసులో వికాష్ దూబే ప్రధాన నిందితుడు. అతడిని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అరెస్ట్ చేసిన పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చే క్రమంలో అతడు ప్రయాణిస్తోన్న వాహనం బోల్తా పడింది. దీన్ని అదునుగా తీసుకున్న వికాస్‌ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో వికాస్‌ మరణించాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us