Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

నాగార్జున అద్భుతమైన లైఫ్‌స్టైల్, ఆహార అలవాట్లు, ఫిట్‌నెస్, హెయిర్ సీక్రెట్స్‌ను మేకప్ మ్యాన్ చంద్ర వెల్లడించారు. మితంగా తినడం, దంపుడు బియ్యం, బెండకాయ, పాంప్లెట్ చేపల ఆహారం, నిమ్మ, ఉసిరి, క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్, రోజూ జిమ్ ఆయన ఆరోగ్య రహస్యాలు. ఈ క్రమశిక్షణ ఆయనను నిత్యయవ్వనంగా ఉంచుతుందని చంద్ర వివరించారు.

Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..
Nagarjuna

Updated on: Aug 29, 2026 | 6:25 PM

చిత్ర పరిశ్రమలో బతికినంత కాలం కింగ్ నాగార్జున లాగా బతకాలి అని ఎంతోమంది హీరోలు కోరుకుంటుంటారు. ఆయన రిచ్‌నెస్ పక్కన పెడితే, ఆయన లైఫ్‌స్టైల్, శారీరక నిర్మాణం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తాయి. నాగార్జునగారి వ్యక్తిగత మేకప్ మ్యాన్ చంద్ర, ఆయన ఆహార, ఆరోగ్య రహస్యాలను, ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో వివరంగా పంచుకున్నారు. నాగార్జున ఆహారం విషయంలో అత్యంత క్రమశిక్షణతో ఉంటారని చంద్ర వెల్లడించారు. ఆయన వారంలో ఐదు రోజులు మామూలు ఆహారాన్నే తీసుకుంటారు, కానీ “మితంగా తీసుకోవాలి” అనే సూత్రాన్ని పాటిస్తారు. ఎక్కువగా తినరు. ఉదయం అల్పాహారంలో ఒక ఇడ్లీ, లేదా ఒక వడ, లేదా ఒక గారె మాత్రమే తీసుకుంటారని తెలిపారు. మళ్ళీ ఆకలి వేసినప్పుడే తింటారని, ఆకలి లేనిదే తినరని స్పష్టం చేశారు. చాలా మంది లాగా ఆకలి ఉన్నా లేకపోయినా దొరికింది తినేయరని చంద్ర వివరించారు.

మధ్యాహ్న భోజనంలో నాగార్జునగారికి కొన్ని ప్రత్యేకమైన వంటకాలు తప్పనిసరిగా ఉండాలి. రోజూ బెండకాయ, హాట్ చిప్స్ ఆయన డైట్‌లో ఉంటాయి. అన్నం విషయంలో దంపుడు బియ్యం (పొట్టు తీయనివి) మాత్రమే తింటారు. ఇవి పాత రోజుల్లో తినే పద్ధతికి దగ్గరగా ఉంటాయని చంద్ర పేర్కొన్నారు. అన్నం చాలా మెత్తగా, దాదాపు చివిడిపోయినట్లు ముద్దగా ఉండాలని ఆయన కోరుకుంటారని, అది అందరూ తినలేరని చంద్ర నవ్వారు. దంపుడు బియ్యంతో పాటు రసం, ఒక అరటిపండు కూడా ఆయన ఆహారంలో భాగం. ఇవన్నీ కూడా తక్కువ మోతాదులోనే తీసుకుంటారని వివరించారు. శనివారం రాత్రి నుండి నాగార్జునగారికి ఇష్టమైన ఆహారం పాంప్లెట్ చేప అని చంద్ర వెల్లడించారు. అవుట్‌డోర్ షూటింగ్స్‌కు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా కేరళ వంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, తాను స్వయంగా ఆయనకు పాంప్లెట్ చేపలను వండి పెట్టేవాడినని చంద్ర తెలిపారు. తెలుగులో దీన్ని చందువ చేప అని కూడా అంటారని పేర్కొన్నారు. నాగార్జున ఒకటికి రెండు చేపలు కూడా తింటారని, అది ఆయనకు చాలా ఇష్టమైన వంటకమని వివరించారు.

సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, మిరియాలు, ఆలివ్ ఆయిల్‌లో నానబెట్టి, ఆ మిశ్రమాన్ని చేపలపై వేసి తయారుచేస్తారు. పసుపు, మామూలు అల్లం వెల్లుల్లి పేస్టు వంటివి వాడరని చెప్పారు. ఆదివారం నాడు మటన్ లేదా చికెన్ కూడా తీసుకుంటారు, కానీ రెండు లేక మూడు ముక్కలకు మాత్రమే పరిమితం చేస్తారని తెలిపారు. ఆదివారం మాత్రం కొద్దిగా ఎక్కువ తింటాడేమో అని చంద్ర అభిప్రాయపడ్డారు. నాగార్జునగారు ప్రతిరోజూ జిమ్ చేస్తారు. ఇది ఆయన దినచర్యలో ముఖ్య భాగం. జిమ్ తో పాటు, ఆయన యవ్వన రూపానికి, ముఖ్యంగా జుట్టు రాలకుండా ఉండటానికి ఒక ప్రత్యేకమైన జ్యూస్ తాగుతారు. షూటింగ్‌కు రాగానే పరగడుపున ఒక పెద్ద రాగి గ్లాసులో ఈ జ్యూస్‌ను చంద్ర స్వయంగా తయారుచేసి ఇచ్చేవారు. ఈ జ్యూస్‌లో నిమ్మకాయ, ఉసిరికాయ, క్యారెట్, బీట్‌రూట్, అలాగే పటికబెల్లం ముక్క లేదా తేనె కలిపి మిక్సీ చేస్తారు. ఈ జ్యూస్ జుట్టు రాలకుండా ఉండటానికి ప్రధాన రహస్యమని, అన్నమయ్య సినిమాకు తప్ప ఆయన కెరీర్‌లో ఎప్పుడూ విగ్ వాడలేదని చంద్ర స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎవరికైనా ఈ జ్యూస్ తాగితే జుట్టు రాలదని, కానీ నాగార్జునగారు దీనిని నిరంతరం మెయింటైన్ చేస్తారు కాబట్టే ఆయన జుట్టు అద్భుతంగా ఉందని చంద్ర పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us