Trending Song: యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు సాంగ్.. ఏకంగా 81 కోట్ల మందిని ఊర్రుతలూగించిన పాట.. డీజేలో వింటే మాములుగా ఉండదు..

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ రచ్చ చేస్తున్నాయి. మరోవైపు కొన్ని సినిమా పాటలు సైతం తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక పాట నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 819 మిలియన్ వ్యూస్ అందుకుని ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. ఈ పాటకు యూత్ లో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Trending Song: యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు సాంగ్.. ఏకంగా 81 కోట్ల మందిని ఊర్రుతలూగించిన పాట.. డీజేలో వింటే మాములుగా ఉండదు..
Kurchi Madathapetti Song

Updated on: Aug 28, 2026 | 12:00 PM

యూట్యూబ్‌లో ఏ ఆల్ టైమ్ రికార్డునైనా బద్దలు కొట్టడంలో మన టాలీవుడ్ పాటలు ఎప్పుడూ ముందే ఉంటాయి. మన సౌత్ ఇండియన్ మ్యూజిక్, దానికి తోడయ్యే పవర్‌ఫుల్ డాన్స్ స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ తెలుగు పాట యూట్యూబ్‌లో ఏకంగా 819 మిలియన్ల (81.9 కోట్లు) వ్యూ్స్ సొంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. డిజిటల్ వేదికలపై తెలుగు సినిమా స్టామినా ఏ స్థాయిలో ఉందో నిరూపించడానికి ఈ రికార్డే ఒక పెద్ద నిదర్శనం. సాధారణంగా ఒక పాట యూట్యూబ్‌లో వంద మిలియన్ల వ్యూస్ సాధించడమే ఒక ఎత్తైతే, ఏకంగా 800 మిలియన్ల మార్కును దాటడం అంటే మాటలు కాదు. ఆకట్టుకునే బాణీలు, శ్రోతలను మంత్రముగ్ధులను చేసే గాత్రం, దానికి తగ్గట్టుగా స్క్రీన్ పై కనిపెంచే విజువల్స్ ఈ పాటకు అతిపెద్ద అసెట్‌గా నిలిచాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ లవర్స్ ఈ పాటను లూప్‌లో వింటూ, రీల్స్ మరియు షార్ట్స్ చేస్తూ ట్రెండ్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

మనం మాట్లాడుకుంటున్న సాంగ్ మరెదో కాదండి. కుర్చి మడతబెట్టి. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిచన గుంటూరు కారం సినిమాలోనిది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ మాత్రం థియేటర్లను ఊపేసింది. సినిమా విడుదలకు ముందు నుంచే యూట్యూబ్ లో దూసుకుపోయింది. ఇప్పటికీ ఎక్కడ విన్నా.. ఏ దావత్ జరిగినా ఈ పాట మారుమోగాల్సిందే. మాస్ బీట్లకు మహేష్ , శ్రీలీల ఎనర్జిటిక్ స్టెప్పులు ఈ పాటకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయనే చెప్పుకొవాలి. ఈ సినిమా విడుదలైన సమయంలోనే కాకుండా, విడుదలైన చాలా రోజుల తర్వాత కూడా ఈ పాట అదే స్థాయిలో ఆదరణ పొందడం విశేషం. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

ఇలాంటి మైలురాళ్ళు టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీ స్థాయిని అంతర్జాతీయంగా మరింత పెంచుతున్నాయి. ప్రాంతీయ సరిహద్దులను చెరిపేస్తూ, భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ స్టెప్పులేయించే శక్తి మన తెలుగు పాటలకు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో మన టాలీవుడ్ సినిమాలు, పాటలు మరిన్ని డిజిటల్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

కుర్చి మడతబెట్టి సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

Loading...
Unable to load recommendations.
Follow Us