జక్కన్నా.. ‘ఆర్ఆర్ఆర్‌’కి కేటీఆర్ టైటిల్ ఇదే

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి‘ఆర్ఆర్ఆర్‌’ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి టైటిల్‌ను అభిమానులే చెప్పాలంటూ ఆ మధ్యన చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా కోరింది. కాగా తాజాగా ‘ఆర్ఆర్ఆర్‌’కు తనదైన శైలిలో టైటిల్‌ను పెట్టారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెండు రోజుల క్రితం ట్విట్టర్‌లో ఓ అభిమాని.. ‘ఆర్ఆర్ఆర్‌’కు మీరు ఏ టైటిల్ పెడుతారంటూ కేటీఆర్‌ను ప్రశ్నించాడు. దానికి స్పందించిన కేటీఆర్.. ‘రీజనల్ రింగ్ రోడ్’ అంటూ సమాధానం ఇచ్చారు. మరి […]

జక్కన్నా.. ‘ఆర్ఆర్ఆర్‌’కి కేటీఆర్ టైటిల్ ఇదే

Edited By:

Updated on: Apr 30, 2019 | 12:41 PM

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి‘ఆర్ఆర్ఆర్‌’ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి టైటిల్‌ను అభిమానులే చెప్పాలంటూ ఆ మధ్యన చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా కోరింది. కాగా తాజాగా ‘ఆర్ఆర్ఆర్‌’కు తనదైన శైలిలో టైటిల్‌ను పెట్టారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెండు రోజుల క్రితం ట్విట్టర్‌లో ఓ అభిమాని.. ‘ఆర్ఆర్ఆర్‌’కు మీరు ఏ టైటిల్ పెడుతారంటూ కేటీఆర్‌ను ప్రశ్నించాడు. దానికి స్పందించిన కేటీఆర్.. ‘రీజనల్ రింగ్ రోడ్’ అంటూ సమాధానం ఇచ్చారు. మరి ఈ టైటిల్‌పై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి.

కాగా బాహుబలి వంటి పెద్ద విజయం తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్‌’ షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్‌లను పూర్తి చేసుకుంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కనిపించనుండగా.. అజయ్ దేవగన్, సముద్రఖని మరో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఎన్టీఆర్‌ కోసం ఎంపిక చేసిన డైసీ ఎడ్గర్ జోన్స్.. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో.. ఆ స్థానం కోసం మరో హీరోయిన్‌ వేటలో పడ్డాడు రాజమౌళి. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.