
తెలుగు సినీ సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎవర్గ్రీన్ మెలోడీలలో జాబిలమ్మ నీకు అంత కోపమా.. పాట ఒకటి. అప్పట్లో ఈ పాట సృష్టించిన సెన్సేషన్ వేరే. ముఖ్యంగా థియేటర్లలో ఈ పాట వచ్చినప్పుడు ప్రతి ప్రేక్షకుడు సైతం గాయకులు అయిపోయేవారు. అంతగా ఈ పాట ప్రతి ఒక్కరి నోటిలో ఆడింది. ప్రేక్షకులందరినీ అలరించిన ఈ పాట, నేటికీ డిజిటల్ వేదికలపై అదే స్థాయిలో ఆదరణ పొందుతూ సంగీత ప్రియులను మైమరపిస్తోంది. వడ్డే నవీన్, మహేశ్వరి జంటగా నటించిన పెళ్లి చిత్రంలోని ఈ పాట యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్‌తో సెన్సేషన్‌గా నిలవడం విశేషం. సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ పాట క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ జెన్ జీ కుర్రాళ్లు సైతం తమ ప్రేయసి అలిగితే ఈ పాటనే పాడుతుంటారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..
జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా అంటూ మొదలయ్యే ఈ పాటలోని ప్రతి పంక్తి ప్రేమలోని సున్నితమైన భావాలను, అలిగిన మనసును ఒప్పించే తీరును అందంగా ఆవిష్కరిస్తుంది. వెండి వెన్నెలే ఎండలా మండితే ఎలా ఉంటుందనే భావనతో ఆవేదనను పంచుకునే విధానం కట్టిపడేస్తుంది. ప్రియురాలి చిరునవ్వు కోరుకునే హృదయం, మనసులో దాచుకున్న మాటలు, కళ్లలోని ప్రేమ కాంతిని గుర్తించమని చేసే అభ్యర్థన ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..
చరణాల్లోని భావాలు మరింత లోతుగా సాగుతూ ప్రేమ, స్నేహం, అభిమానాల మధ్య ఉండే సున్నితమైన కోణాన్ని తెలియజేస్తాయి.
మనసులో తన బొమ్మ కొలువుందో లేదో చూడమని కోరడం, తోడు కోరి దగ్గరైతే తప్పు కాదంటూ చేసే వేడుకోలు ఈ పాటను శ్రోతలకు మరింత చేరువ చేశాయి. ఎప్పటికీ పాతబడని బాణీ, భావోద్వేగభరితమైన ఆలాపన కలయికతో ఈ గీతం కాలంతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఈ పాట తన ప్రత్యేకతను నిలుపుకుంటూనే ఉంది. ఇప్పటికీ ఈ సాంగ్ కు ప్రత్యేకమైన వైబ్ ఉందంటే నమ్మగలరా.. ? మరోసారి ఈ పాటను మీరు పాడేయండి..
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.
ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..