నా తమ్ముడిని చివరిసారిగా చూడలేకపోయా: యేసుదాసు భావోద్వేగ వ్యాఖ్యలు

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి ఎంతోమందిని శోకసంద్రంలోకి నెట్టింది. ఆయన మరణించారన్న వార్తను

నా తమ్ముడిని చివరిసారిగా చూడలేకపోయా: యేసుదాసు భావోద్వేగ వ్యాఖ్యలు

Updated on: Sep 27, 2020 | 1:36 PM

Yesudas about SPB: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి ఎంతోమందిని శోకసంద్రంలోకి నెట్టింది. ఆయన మరణించారన్న వార్తను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయనతో మంచి సాన్నిహిత్యం కలిగిన ఆనాటి గాయకులు ఒక మంచి స్నేహితుడిని కోల్పోయామంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఇక కరోనా నేపథ్యంలో వయస్సు దృష్ట్యా చాలా మంది అలనాటి గాయకులు ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. ఈ క్రమంలో ప్రముఖ గాయకుడు యేసుదాసు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

”బాలు నా సొంత సోదరుడు కంటే ఎక్కువ, ఆయనతో కలిసి చాలా ఏళ్లు ప్రయాణం చేశా. భౌతికంగా బాలు మన మధ్య లేకపోయినా, ఙ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటారు. బాలుతో చాలా సంవత్సరాలు ప్రయాణం చేశా. సంగీత ప్రపంచంలో బాలు చెరిగిపోలేని ముద్రను వేసుకున్నారు” అని అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో కడసారి తన సోదరుడిని చూసుకోలేకపోయానంటూ ఎమోషనల్‌ అయ్యారు. కాగా సంగీత ప్రపంచంలో యేసుదాసు, ఎస్పీబీ లెజండ్లు కాగా.. వీరిద్దరి కాంబోలో ఎన్నో పాటలు వచ్చాయి. ఆ పాటలన్నీ మంచి విజయాలు సాధించిన విషయం తెలిసిందే.

Read More:

అలా అడిగిన వ్యక్తికి మా నాన్న ఏమని సమాధానమిచ్చారంటే

లూడో గేమ్‌లో ఓడించాడని.. తండ్రిపై కోర్టుకెక్కిన కూతురు

Loading...
Unable to load recommendations.
Follow Us