Karthika Deepam Vantalakka : హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని వంటలక్క ఆస్తులు.. విలువ ఎంతో తెలుసా..!

|

Mar 01, 2021 | 5:07 PM

మలయాళ, కన్నడ తెలుగు బుల్లి తెరపై సందడి చేసిన ప్రేమి త్వరలో వెండి తెరపై అలరించడానికి రెడీ అయ్యింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుందట. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్...

Karthika Deepam Vantalakka : హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని వంటలక్క ఆస్తులు.. విలువ ఎంతో తెలుసా..!
Follow us on

Karthika Deepam Vantalakka: మలయాళంలో సూపర్ హిట్ సీరియల్ మూడేళ్ళ క్రితం తెలుగులో కార్తీక దీపంగా అడుగు పెట్టింది. ఈ సీరియల్ లో ప్రధాన పాత్ర దీప గా నటిస్తున్న అసలు పేరు ప్రేమి విశ్వనాథ్ . ఈ కేరళ కుట్టి వంటలక్కగా తెలుగు లోగిళ్ళలో ప్రముఖ స్థానాన్ని అభిమానాన్ని సంపాదించుకుంది. వెయ్యి ఎపిసోడ్స్ చెరువులో ఉన్నా కార్తీక దీపానికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. సీరియల్స్ అంటే ఆడవారే చూస్తారు అన్న మాటను చెరిపేసి.. మగవాళ్లకు కూడా తన అభిమానులుగా చేసుకుంది. ఇక అత్యధిక టీఆర్ఫీ రేటింగ్ తో దూసుకుపోతుంది. దీనికి ఈ సీరియల్ లోని ప్రధాన పాత్రలు అయితే ప్రధాన కారణం మాత్రం ఖచ్చితంగా ప్రేమి విశ్వనాధ్ అని చెప్పవచ్చు.

ఇప్పటికే మలయాళ, కన్నడ తెలుగు బుల్లి తెరపై సందడి చేసిన ప్రేమి త్వరలో వెండి తెరపై అలరించడానికి రెడీ అయ్యింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుందట. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కావాల్సి ఉంది.. అయితే కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా రిలీజ్ లెట్ అయింది.

అయితే ప్రేమి సంపాదన హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోదని.. ఒకొక్క ఎపిసోడ్ కి లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. పైగా మలయాళ సినిమాల్లోనూ నటిస్తుంది ప్రేమీ. అక్కడా ఈమెకు లక్షల్లోనే పారితోషికం అందుతుంది. మరోవైపు కన్నడ లో కూడా బాగా ఫేమస్ అయి గేమ్ షోస్ లో కూడా ప్రెసెంట్ చేస్తూ రియాలిటీ షో లో హోస్ట్ గా చేసింది ప్రేమి. ఇక ఆమె ఆస్తులు విషయానికొస్తే . 2020 లెక్కల ప్రకారం 36 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ఇటీవల 60 లక్షలు పెట్టి కార్ ని కొన్నారని ఫొటోస్ తో వైరల్ అవుతుంది. విశ్వనాధ్ సొంత ఊరు ఎరణకులం అక్కడ తనకి డూప్లెస్ హౌస్ ఉంది దీని విలువ దాదాపు 2కోట్లు వరకు ఉంటుంది, త్రివేండ్రం లో కూడా కోటి 50 లక్షల తో ఒక ఫ్లాట్ కొన్నారు, 10 ఎకరాలు వ్యవసాయ క్షేత్రం కూడా ఉందట. ఇది వారసత్వంగా వచ్చింది. దీని విలువ లక్షల్లో ఉంటుందట. ప్రేమి కి 30 లక్షల విలువ చేసే ఇండిగో కారు ఉంది. ఇప్పుడు 60 లక్షల విలువ చేసే మరొక కారు వచ్చి చేరింది.

ప్రేమి విశ్వనాధ్ భర్త డాక్టర్ టీ.ఎస్ వినీత్ భట్, రష్యాన్ పార్లమెంట్ మాస్కో లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ అవార్డు లు కూడా గెల్చుకున్నారు, సెలెబ్రటీస్ కూడా వినీత్ దగ్గర జాతకం చూపించుకుంటారు. అలా చాలా కోట్లు సంపాదించారు.తనకి ఎన్ని కోట్లు ఉన్న యాక్టింగ్ తన ప్రొఫెషన్ అని చెప్పారు దీప.

Also Read:

దీప్తితో బ్రేకప్ అయ్యిందా..? షణ్ముఖ్‌ జశ్వంత్ సోషల్ మీడియా లైవ్‌లో క్లారిటీ ఇచ్చేశాడు

‘ముందుంది పెద్ద ముప్పు, ఇది ట్రైలర్ మాత్రమే !’ ముకేశ్ అంబానీకి జైష్-ఉల్-హింద్ బెదిరింపు మెసేజ్.