‘Sultan’ Teaser : యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న కార్తి ‘సుల్తాన్’ .. ఆకట్టుకున్న టీజర్..

|

Feb 01, 2021 | 8:01 PM

‘ఖైదీ’ అనే మంచి థ్రిల్లర్‌ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో కార్తి.. ఆతర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ‘సుల్తాన్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు...

Sultan Teaser : యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న కార్తి సుల్తాన్ .. ఆకట్టుకున్న టీజర్..
Follow us on

‘Sultan’ Teaser :  ‘ఖైదీ’ అనే మంచి థ్రిల్లర్‌ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో కార్తి.. ఆతర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ‘సుల్తాన్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కార్తి, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన ‘సుల్తాన్’ సినిమాకు ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్నఈసినిమానుంచి తాజాగా టీజర్ నువిడుదల చేశారుచిత్రయూనిట్.

మహాభారతం చదివావా.. భారతంలో కృష్ణుడు వంద అవకాశాలు ఇచ్చినా కౌరవులు మారలేదు.. నువ్వు ఇవ్వమంటుంది ఒక్క అవకాశమే కదా.. ఇస్తా..’అంటూ టీజర్ స్టార్ట్ అవుతుంది. కృష్ణుడు పాండవుల పైపు నిలబడ్డాడు.. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే.. అదే మహాభారతాన్ని యుద్ధం లేకుండా ఊహించుకోండి’ అంటూ కార్తీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ మెర్విన్ నేపథ్య సంగీతం అలరించింది. లక్కీ బ్యూటీ రష్మిక ఈ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి ..