Oscar Awards 2024: ఆస్కార్ విజేతలకు లభించే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? అవార్డును అమ్ముకుంటే వచ్చేది ఎంతంటే?

సాధారణంగా సినిమా తారలకు సంబంధించి ఆస్కార్‌కి నామినేట్‌ కావడమే ఒక పెద్ద ఘనత. అలాంటిది ఏకంగా అవార్డు అందుకుంటే అంతకన్నా మధుర క్షణం మరొకటి ఉండదు.అయితే నివేదికల ప్రకారం, ఆస్కార్ గెలిచిన తర్వాత, విజేతకు...

Oscar Awards 2024: ఆస్కార్ విజేతలకు లభించే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? అవార్డును అమ్ముకుంటే వచ్చేది ఎంతంటే?
Oscar Awards 2024
Follow us

|

Updated on: Mar 11, 2024 | 1:59 PM

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ ఈ సినిమా పండగకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది సినిమా తారలు పాల్గొన్నారు. ఊహించినట్లుగానే’ ఓపెన్‌హైమర్ ‘ సినిమాకు అవార్డుల పంట పండింది. ‘ఉత్తమ సినిమా’, ‘ఉత్తమ దర్శకుడు’, ‘ఉత్తమ నటుడు’ తో సహా మొత్తం 7 అవార్డులు ఈ సినిమాను వరించాయి. సాధారణంగా సినిమా తారలకు సంబంధించి ఆస్కార్‌కి నామినేట్‌ కావడమే ఒక పెద్ద ఘనత. అలాంటిది ఏకంగా అవార్డు అందుకుంటే అంతకన్నా మధుర క్షణం మరొకటి ఉండదు.అయితే నివేదికల ప్రకారం, ఆస్కార్ గెలిచిన తర్వాత, విజేతకు ఎలాంటి ప్రైజ్ మనీ లభించదు. కేవలం బంగారు పూత పూసిన ట్రోఫీ మాత్రమే బహూకరిస్తారు. సాధారణంగా మన దేశంలో అయితే ఏదైనా అవార్డు వస్తే నగదు కూడా బహూకరించే సంప్రదాయం ఉంది. అయితే ఆస్కార్‌ గెలుచుకున్న వారికి అవార్డు తప్ప మరేమీ లభించదు. కానీ దీని వల్ల ప్రత్యక్ష ప్రయోజనాల కంటే పరోక్ష ప్రయోజనాలే చాలా ఎక్కువ.

ఆస్కార్ గెలిస్తే అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడుతుంది. కళాకారులు, సాంకేతిక నిపుణులు పేరు ప్రఖ్యాతులు పొందుతారు. దీంతో పాటు రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. ఆస్కార్ విన్నింగ్ ప్రొడక్షన్ హౌస్‌ల చిత్రాలకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది.. ఇక ఆస్కార్ ట్రోఫీ విషయానికి వస్తే.. దీనిని కాంస్యంతో తయారుచేస్తారు. 24 క్యారెట్ల బంగారంతో పూత పూస్తారు. ట్రోఫీని తయారు చేయడానికి 1000 డాలర్లు పడుతుంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 82 వేల రూపాయలు.

ఇవి కూడా చదవండి

ఓపెన్ హైమర్ కు  విభాగాల్లో పురస్కారాలు..

అమ్మితే వచ్చేది అంతేనా?

ఆస్కార్ గెల్చుకున్న సెలబ్రిటీలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంటుంది. ఇక విజేతలు తమ ‘ఆస్కార్’ ట్రోఫీని విక్రయించే హక్కు కూడా ఉంటుంది. అయితే అకాడమీకి మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. ప్రతిఫలంగా, మీకు 1 డాలర్ లభిస్తుంది. అంటే కేవలం 82 రూపాయలు. బయటివారికి ఆస్కార్ అవార్డులను విక్రయించకుండా ఉండేందుకు ఈ అవార్డులను పంపిణీ చేసే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్ సైన్స్ ఈ తరహా నిబంధనలను రూపొందించింది.

ఆస్కార్ వేదికపై ఓపెన్ హైమర్ చిత్ర బృందం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి