hollywood actor will smith : పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తా అంటున్న హాలీవుడ్ స్టార్.. ఎందుకో కారణాలు తెలియజేసిన కండల వీరుడు..

|

Mar 03, 2021 | 4:55 PM

hollywood actor will smith : హాలీవుడ్ సూపర్‌ స్టార్ విల్‌స్మిత్ తాజాగా తన పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలపై మక్కువ చూపించే

hollywood actor will smith : పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తా అంటున్న హాలీవుడ్ స్టార్.. ఎందుకో కారణాలు తెలియజేసిన కండల వీరుడు..
Follow us on

hollywood actor will smith : హాలీవుడ్ సూపర్‌ స్టార్ విల్‌స్మిత్ తాజాగా తన పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలపై మక్కువ చూపించే ఈ హాలీవుడ్ స్టార్ ‘పాడ్‌సేవ్ అమెరికా’ అనే పాడ్‌కాస్ట్‌లో రాజకీయ ప్రవేశం, జాత్యహంకారం గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. తాను ఎప్పటి నుంచో రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నానని కానీ సరైన సమయం కోసం వేచి చూస్తున్నానని ప్రకటించారు. పాలిటిక్స్‌లో చేరడంపై ఓ అభిప్రాయం ఉందన్న విల్ స్మిత్.. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు, సామాజిక సామరస్యాన్ని కలిగించేందుకు చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగమన్నారు. ఏదో ఒక సమయంలో అకస్మాత్తుగా రాజకీయాల్లోకి అడుగుపెడతానని స్పష్టం చేశారు.

యూఎస్‌లో నల్లజాతీయుడిగా పెరగడంపై అనుభవాలను పంచుకున్న విల్ స్మిత్.. తన మొహం మీదనే చాలా వల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఐదారు సార్లు తిట్టారని తెలిపాడు. కానీ స్మార్ట్ పర్సన్స్‌ నుంచి అలాంటి పదాలు వినలేదన్నారు. రేసిస్ట్, రేసిజం అనేది మూర్ఖత్వమన్న హీరో.. వాళ్లు డేంజరస్‌గా ఉన్నప్పుడు తను కొంచెం స్మార్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తానెప్పుడూ జాత్యహంకారి కళ్లలోకి చూడలేదని, రేసిజమ్‌ను తెలివైన పనిగా భావించలేదని తెలిపారు. తాను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు సిస్టమెటిక్ రేసిజమ్ చూశానని, ఆ సమయంలో అజ్ఞానం, చెడుకు మధ్య తేడా గమనించానని చెప్పారు. అదృష్టవశాత్తు అజ్ఞానం చెడుకన్నా ఎక్కువ పాళ్లలో ఉందని, దీనికి విద్య మరియు అవగాహన ప్రక్రియ ద్వారా ఉపశమనం కలిగించవచ్చని, తద్వారా సమాజంలో మంచి మార్పు గమనించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే తన అభిమాన హీరో రాజకీయాలలోకి వస్తున్నాడని ప్రకటించడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

మరిన్ని చదవండి : Green Tea Benfits : ఐదు నిమిషాలు మరగబెట్టిన గ్రీన్ టీతో అద్భుత ఫలితాలు.. నగరంలో విస్తరిస్తున్న నయా ట్రెండ్

దర్శకధీరుడి చేతుల మీదుగా ‘ఆకాశవాణి’ టీజర్ విడుదల… రిలీజ్ డేట్‏ను ఫిక్స్ చేసిన చిత్రయూనిట్.. ఎప్పుడంటే..