Red Movie In OTT: ఓటీటీలోకి ఎనర్జిక్ట్ స్టార్ రామ్ ‘రెడ్’ సినిమా.. విడుదల తేదీని ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

|

Feb 17, 2021 | 4:36 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. డైరెక్టర్ తిరుమల కిషోర్ కాంబినేషన్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'రెడ్'. ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై

Red Movie In OTT: ఓటీటీలోకి ఎనర్జిక్ట్ స్టార్ రామ్ రెడ్ సినిమా.. విడుదల తేదీని ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..
Follow us on

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. డైరెక్టర్ తిరుమల కిషోర్ కాంబినేషన్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘రెడ్’. ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ, అమృతా అయ్యార్ హీరోయిన్లుగా నటించారు. తమిళ సినిమా ‘తడమ్’‏కు ఇది రీమేక్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‎గా నిలిచింది. తాజాగా ఈ హిట్ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కెరీర్‏లో సూపర్ హిట్‏గా నిలిచిన ‘రెడ్’ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్ భారీ మొత్తంలో కొనుగోలు చేసింది. ఈ సినిమాను ఈ నెల 23న స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా సమాచారం. ఇక ఈ మూవీ ఓటీటీలో విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Also Read:

20 years of Mahesh Babu’s Murari : 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న మహేష్ బాబు క్లాసిక్ సూపర్ హిట్ ‘మురారి’