#HBDMegastarChiranjeevi: హ్యాపీ బర్త్ డే టు ‘మెగాస్టార్’… హోరెత్తుతున్న ట్వీట్స్!

ఆగస్టు 22 వచ్చింది అంటే మెగాస్టార్ అభిమానులకు పండుగే. కొన్నేళ్ల క్రితం ఈ హంగామా ఎక్కువగా ఉండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీ, రేడియో అన్నింట్లోనూ మెగాస్టార్ పాటలతో నిండిపోయేవి. 2007 వరకు ఈ జోరు సాగింది. 2008 లో మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత ఆ స్పీడ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. రాజకీయాల్లో బిజీ కావడంతో చిరంజీవి కూడా తన పుట్టిన రోజు వేడుకలపై పెద్దగా ఆసక్తి పెట్టలేదు. అయితే, 2015 తరువాత మరలా […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:34 am, Thu, 22 August 19
#HBDMegastarChiranjeevi: హ్యాపీ బర్త్ డే టు 'మెగాస్టార్'... హోరెత్తుతున్న ట్వీట్స్!

ఆగస్టు 22 వచ్చింది అంటే మెగాస్టార్ అభిమానులకు పండుగే. కొన్నేళ్ల క్రితం ఈ హంగామా ఎక్కువగా ఉండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీ, రేడియో అన్నింట్లోనూ మెగాస్టార్ పాటలతో నిండిపోయేవి. 2007 వరకు ఈ జోరు సాగింది. 2008 లో మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత ఆ స్పీడ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. రాజకీయాల్లో బిజీ కావడంతో చిరంజీవి కూడా తన పుట్టిన రోజు వేడుకలపై పెద్దగా ఆసక్తి పెట్టలేదు.

అయితే, 2015 తరువాత మరలా పరిస్థితి మారిపోయింది. 2015లో మెగాస్టార్ తన 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రారంభించాడు. 2017 జనవరి 11 న సినిమా రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ కావడమే కాకూండా మెగాస్టార్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది.  ఇక 2019 ఆగష్టు 14 వ తేదీన సైరాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ మేకింగ్ వీడే సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆగస్ట్ 20 న ముంబైలో మెగాస్టార్ సైరా టీజర్ రిలీజ్ అయ్యింది.

తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మెగాస్టార్ అభిమానులంతా చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో బిజీగా ఉన్నారు. కేక్ కటింగ్ లు, సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు.. ఇలా చిరంజీవి పుట్టిన రోజును సెలబ్రేట్ చేస్తున్నారు. మరోవైపు ఇంటర్నెట్ లో మెగాస్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మెగాస్టార్ ను శుభాకాంక్షలతో ముంచెత్తారు.