నక్షత్రానికి హన్సిక పేరు.. మరిచిపోలేని బర్త్‌డే గిఫ్ట్‌

పాలబుగ్గల సుందరి హన్సిక ఆదివారం తన 29వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు

నక్షత్రానికి హన్సిక పేరు.. మరిచిపోలేని బర్త్‌డే గిఫ్ట్‌

Updated on: Aug 10, 2020 | 12:10 PM

Star Named after Hansika: పాలబుగ్గల సుందరి హన్సిక ఆదివారం తన 29వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ పుట్టినరోజు సందర్భంగా హన్సికకు మరిచిపోలేని బహుమతిని ఇచ్చారు కుటుంబ సభ్యులు, సన్నిహితులు. 79.30 కాంతి సంవత్సరాల దూరంలోని ఓ నక్షత్రానికి హన్సికా మోత్వాని అన్న పేరును వారు రిజిస్టర్ చేయించారు.  ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

”నక్షత్రాలతో నేను ఎంత నిమగ్నమవుతానో మీకు తెలుసు. నా కుటుంబం, స్నేహితులు నాకు మరిచిపోలేని ఙ్ఞాపకాన్ని ఇచ్చారు. ఓ నక్షత్రానికి నా పేరును రిజిస్టర్ చేయించారు. ఇంతకన్నా నాకు మంచి బర్త్‌డే గిఫ్ట్ ఏది ఉంటుంది. చాలా థ్యాంక్స్” అని హన్సిక రాసుకొచ్చారు. దీనికి ఒక కొత్త నక్షత్రం పుట్టింది అన్న హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు. ఇక హన్సిక పోస్ట్‌పై స్పందిస్తోన్న నెటిజన్లు కంగ్రాట్స్ అంటూ అభినందనలు చెబుతున్నారు.

Read This Story Also: టీడీపీకి మరో షాక్‌.. వైసీపీలో చేరనున్న చలమలశెట్టి సునీల్‌

Loading...
Unable to load recommendations.
Follow Us