Gautami: నేను బాధను చూసి నా కూతురు ఎఫెక్ట్ అయ్యింది.. నన్ను అలా చూడలేకపోయింది.. టాలీవుడ్ హీరోయిన్..

సీనియర్ నటి గౌతమి ఇటీవలి ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కూతురు సుబ్బలక్ష్మి పడిన ఆవేదన, అలాగే వివాహ బంధంలో నిజమైన నిబద్ధత ప్రాముఖ్యతపై భావోద్వేగంగా స్పందించారు. మనశ్శాంతి, వ్యక్తిగత ఎదుగుదల కోసం తీసుకున్న నిర్ణయాలు, బంధాల్లో పరస్పర గౌరవం గురించి ఆమె పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

Gautami: నేను బాధను చూసి నా కూతురు ఎఫెక్ట్ అయ్యింది.. నన్ను అలా చూడలేకపోయింది.. టాలీవుడ్ హీరోయిన్..
Gauthami

Updated on: Nov 21, 2026 | 7:37 PM

90వ దశకంలో దక్షిణాది సినిమా రంగంలో అగ్ర కథానాయికగా వెలుగొందిన హీరోయిన్లలో గౌతమి ఒకరు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ మరోసారి వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం, గత అనుబంధాలు, కూతురు సుబ్బలక్ష్మితో ఉన్న బంధం, అలాగే వివాహ వ్యవస్థపై తన అభిప్రాయాలను భావోద్వేగంగా పంచుకున్నారు. నటుడు కమల్ హాసన్‌తో తన అనుబంధం ముగియడానికి గల పరిస్థితుల గురించి గౌతమి స్పష్టతనిచ్చారు. తమ ఇద్దరి “గ్రోత్ పాటర్న్స్” వేరే దారుల్లో ప్రయాణించడమే ప్రధాన కారణమని చెప్పారు. ఆ వైరుధ్యాన్ని తాను తట్టుకోలేకపోయానని, తనతో తాను రాజీ పడి బతకడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. వ్యక్తిగత ఎదుగుదల, మనశ్శాంతి తనకు ఎంతో ముఖ్యమని, అందుకే ఆ బంధం నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

తన కుమార్తె సుబ్బలక్ష్మి ఎంతో సెన్సిటివ్ అని, తాను పడిన ఆవేదనను, కష్టాలను చూసి ఆమె ఎంతో ప్రభావితమైందని గౌతమి తెలిపారు. తల్లి సంతోషంగా, ప్రశాంతంగా ఉంటేనే కూతురు కూడా ప్రశాంతంగా ఉంటుందని గ్రహించి, తనను తాను నిలబెట్టుకోవడానికి మరింత శ్రమించానని చెప్పారు. ఇక శృతి హాసన్‌తో సంబంధాల గురించి మాట్లాడుతూ.. శృతి, సుబ్బలక్ష్మి మధ్య ఎప్పుడూ ఎలాంటి విభేదాలు లేవని, అయితే ప్రస్తుతం పెద్దగా టచ్‌లో లేమని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

వివాహం అనేది కేవలం ఒక సామాజిక ఏర్పాటు మాత్రమే కాదని, అనేక సంప్రదాయాలు, అందమైన అర్థాలతో ముడిపడి ఉన్న బంధమని గౌతమి అభిప్రాయపడ్డారు. అయితే ఆ బంధంలో ఇద్దరి వైపు నుంచి నిజమైన నిబద్ధత (కమిట్‌మెంట్) ఉండటం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. కేవలం సంతకాలు, ఆచారాలకే పరిమితమై మనసులో నిబద్ధత లేకపోతే, ఆ బంధాలు కొందరికి ఒత్తిడిగా, దోపిడీకి దారితీసే పరిస్థితిగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీ, పురుషులెవరైనా ఇలాంటి సందర్భాల్లో బాధపడే అవకాశం ఉంటుందని, పరస్పర గౌరవం, అవగాహనతో కూడిన నిజమైన కమిట్‌మెంట్ ఉన్నప్పుడే వివాహానికి అసలైన అర్థం దక్కుతుందని గౌతమి తన మాటల్లో పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

గౌతమి కూతురు..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us