
Bachchan Pandey Movie Update: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘బచ్చన్ పాండే’. ఇటీవలే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‌తో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాకు పర్హద్ సామ్ జీ డైరెక్షన్ వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ బీటౌన్‌లో హల్ చల్ చేస్తోంది.
బీహారి యాక్టర్ అభిమన్యు సింగ్.. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు పొందాడు. తాజా సమాచారం ప్రకారం అభిమన్యు బచ్చన్ పాండే సినిమాలో నటిస్తున్నాడట. ఇందులో అక్షయ్ కుమార్‌కు విలన్‌గా అభిమన్యు నటించనున్నట్లు ప్రకటించారు ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో అభిమన్యు ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లుగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు తరుణ్. ఇందులో కృతి సనన్ హీరోయిన్గా నటిస్తుంది. ఓ నటుడు అవ్వాలకునే గ్యాంగ్ స్టర్ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు.