Actor Nani: ప్యారడైజ్ తర్వాత లుక్కు మార్చిన నాని.. బ్లడీ రోమియోగా న్యాచురల్ స్టార్.. మేకోవర్ అదిరిపోయిందిగా..

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇటీవలే ప్యారడైజ్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. పూర్తిగా మాస్, రగ్గడ్ లుక్కులో థియేటర్లను షేక్ చేశారు. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే.. నాని తన కొత్త సినిమా కోసం లుక్కు పూర్తిగా మార్చేశాడు. బ్లడీ రోమియోతో అడియన్స్ ముందుకు రానున్నాడు.

Actor Nani: ప్యారడైజ్ తర్వాత లుక్కు మార్చిన నాని.. బ్లడీ రోమియోగా న్యాచురల్ స్టార్.. మేకోవర్ అదిరిపోయిందిగా..
Nani

Updated on: Oct 11, 2026 | 10:12 AM

టాలీవుడ్ స్టార్ హీరో నాని తన ప్రయోగాత్మక చిత్రాలతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు. పాత్ర డిమాండ్ చేస్తే ఎంతటి విభిన్న గెటప్‌కైనా సిద్ధపడే ఆయన, తాజాగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘బ్లడీ రోమియో’ కోసం పూర్తిగా కొత్త అవతారంలోకి మారిపోయారు. ఇటీవలి కాలంలో ది ప్యారడైజ్ సినిమా కోసం పూర్తిగా రగ్డ్, మాస్ లుక్‌లో కనిపించిన నాని, ఈ సినిమా కోసం అల్ట్రా-స్టైలిష్ అండ్ క్లాసీ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ కొత్త మేకోవర్‌కు సంబంధించిన లుక్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ డిజైనర్ ఆలిమ్ హకీమ్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ కొత్త లుక్‌లో నాని ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ట్రెండీ కర్లీ మల్లెట్ హెయిర్‌స్టైల్, దానికి తగినట్లుగా ధరించిన బ్లాక్ రౌండ్ సన్‌గ్లాసెస్ ఆయనకు సరికొత్త స్వాగ్‌ను తీసుకొచ్చాయి. దర్శకుడు సుజీత్ ఈ చిత్రం కోసం నానిని మునుపెన్నడూ చూడని సరికొత్త కోణంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ భారీ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి: Bathukamma Song : యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మంగ్లీ కొత్త బతుకమ్మ పాట.. గంటల్లోనే 

ఈ చిత్రంలో నాని పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఒకవైపు నిపుణుడైన చెఫ్‌గా కనిపిస్తూనే, మరోవైపు ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్ షేడ్స్‌ను ప్రదర్శించే సరికొత్త రోల్‌లో ఆయన నటిస్తున్నారు. “బ్లడీ రోమియో.. ది కిచెన్ ఓపెన్స్ సూన్” అంటూ వచ్చిన ప్రమోషనల్ అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. వంటశాల నేపథ్యంలో సాగే క్రైమ్ , యాక్షన్ డ్రామా ప్రేక్షకులకు ఒక కొత్త సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ లండన్‌లో ప్లాన్ చేశారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ నాని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి: Jaya Prada: ఆ హీరోకు అత్తగా నటించా.. అతడు అంటే నాకు పిచ్చి ఇష్టం.. జయప్రద..

ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నెల నుంచే స్టార్ట్ కానుందని సమాచారం. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని వినూత్నమైన కాన్సెప్ట్ తో సుజీత్ ఈ సినిమాను మలుస్తున్నారని సమాచారం. ది ప్యారడైజ్ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది.

ఎక్కువమంది చదివినవి: Nana Patekar : నా ఆస్తి ఆ 12 ఎండు కట్టలే.. నేను ముందే పక్కన పెట్టుకున్నా.. నానా పటేకర్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..

నాని..

 

ఎక్కువమంది చదివినవి: Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్ పర్సన్.. నటనలో మా ఇద్దరికీ పోటీ ఉండేది.. హీరో శ్రీకాంత్..

Loading...
Unable to load recommendations.
Follow Us