
Murder first Song released: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వస్తోన్న తాజా చిత్రం ‘మర్డర్’. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఓ పరువు హత్య ఆధారంగా వర్మ ఈ సినిమాను నిర్మించారు. ఆనంద్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కుటుంబ కథా చిత్రం అన్న ట్యాగ్‌లైన్‌తో ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ విడుదలై అంచనాలను పెంచేయగా.. తాజాగా అందులో నుంచి ఓ పాటను విడుదల చేశారు వర్మ. ‘పిల్లల్ని ప్రేమించడం తప్పా’ అంటూ సాగే ఈ పాటను వర్మనే ఆలపించడం విశేషం. ఇక శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి, గాయత్రి భార్గవి తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే కరోనా సమయంలో ఇప్పటివరకు తాను నిర్మించిన చిత్రాలను ఆన్లైన్లో విడుదల చేస్తూ వచ్చిన వర్మ.. ‘మర్డర్’ మూవీని మాత్రం థియేటర్లలోనే విడుదల చేస్తామని వర్మ టీమ్ ప్రకటించడం గమనర్హం.
Read This Story Also: కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి