లారెన్స్ పెద్దమనసు.. ‘కేరళ అమ్మ’కు ఇల్లు..

యాక్టర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ సేవా కార్యక్రమాల్లో ముందుంటారనే చెప్పాలి. అనాథ పిల్లలను ఆదుకోవడంలో, ఉచిత ఆపరేషన్లు చేయించడంలో ఆయనది అందవేసిన చేయి. 2018 సంవత్సరంలో గజ తుపాను తమిళనాడు, కేరళను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. భీకరమైన గాలులు, భారీ వర్షాలతో చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ క్రమంలో కేరళలోని ఓ పెద్దావిడ ఇల్లు కూడా కూలిపోయింది. దీంతో ఆమె కన్నీటి పర్యంతమయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ […]

లారెన్స్ పెద్దమనసు.. కేరళ అమ్మకు ఇల్లు..

Updated on: May 19, 2019 | 3:22 PM

యాక్టర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ సేవా కార్యక్రమాల్లో ముందుంటారనే చెప్పాలి. అనాథ పిల్లలను ఆదుకోవడంలో, ఉచిత ఆపరేషన్లు చేయించడంలో ఆయనది అందవేసిన చేయి. 2018 సంవత్సరంలో గజ తుపాను తమిళనాడు, కేరళను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. భీకరమైన గాలులు, భారీ వర్షాలతో చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ క్రమంలో కేరళలోని ఓ పెద్దావిడ ఇల్లు కూడా కూలిపోయింది. దీంతో ఆమె కన్నీటి పర్యంతమయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ ఆ పెద్దావిడకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. అన్నట్లుగా ఇప్పుడు ఆవిడకు తన సొంత డబ్బులతో ఇళ్లును నిర్మించి ఇచ్చాడు. పూజలు నిర్వహించిన అనంతరం వృద్ధు రాలితో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ విషయాన్ని లారెన్స్ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చిన యువకులకు ధన్యవాదాలు తెలిపారు లారెన్స్.

Loading...
Unable to load recommendations.
Follow Us