Nana Patekar : రేపు నేను ఉంటానో లేదో తెలియదు.. మృత్యువు గురించి మూడు రోజుల ముందే మాట్లాడిన నానా..

సినీనటుడు నానా పటేకర్ గురువారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన ఇఖ లేరన్న వార్త సినీ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. నానా మృతిపై సినీ రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర పూణేలోని ఫామ్‌హౌజ్‌లోనే నానాపటేకర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Nana Patekar : రేపు నేను ఉంటానో లేదో తెలియదు.. మృత్యువు గురించి మూడు రోజుల ముందే మాట్లాడిన నానా..
Nana Patekar Last Words

Updated on: Oct 08, 2026 | 1:01 PM

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన పవర్‌ఫుల్ నటనతో, నిరాండంబర జీవితంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు నానా పటేకర్. ఆయన అకాల మరణం యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. గురువారం ఉదయం గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారనే వార్త వినగానే చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నానా వయసు ప్రస్తుతం 75 సంవత్సరాలు. అయితే ఆయన మరణానికి కేవలం మూడు రోజుల ముందు గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో జీవితం, మరణం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. అక్టోబర్ 4న గోవాలోని దొనా పౌలా వద్ద ‘సమ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్’ నిర్వహించిన సామాజిక కార్యక్రమంలో నానా పటేకర్ పాల్గొన్నారు. ఆ వేదికపై జీవితం , మరణం సత్యాన్ని వివరిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయాలను పిండేస్తున్నాయి. తన స్నేహితులతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న నానా.. రేపు నేను ఉంటానో లేదో తెలియదు అని అన్నారు..

ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..

“ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే. రేపు నేను ఇక్కడ ఉంటానో లేదో నాకు కూడా తెలియదు. ఆ సమయం మనందరి జీవితంలోనూ వస్తుంది. కానీ ఆ సమయం ఆసన్నమయ్యే లోపే.. ‘మనం చేయాలనుకున్న పనిని చేయగలిగామా? దానికి తగిన ప్రయత్నం చేశామా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి” అని చెప్పుకొచ్చారు.

1978లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నానా పటేకర్, హిందీ, మరాఠీ , తమిళ భాషలలో 75కి పైగా చిత్రాలలో నటించారు. 2008లో భారతిరాజా దర్శకత్వం వహించిన ‘పొమ్మలాట్టం’ చిత్రంతో తమిళ చిత్రసీమలో అరంగేట్రం చేసిన నానా పటేకర్, రజనీకాంత్ నటించిన ‘కాల’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. నానా పటేకర్ 1995లో ‘క్రాంతివీర్’ చిత్రానికి ఉత్తమ నటుడిగా, 1990లో ‘పరిందా’ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా, 1997లో ‘అగ్ని సాక్షి’ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 3 జాతీయ అవార్డులు గెలుచుకున్న నానా పటేకర్‌కు, చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశేష సేవలకు గాను 2013లో పద్మశ్రీ పురస్కారం లభించింది.

ఎక్కువమంది చదివినవి : Babu Mohan: ఆ పాట చూసి చిరంజీవి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.. బాబూ మోహన్..

Loading...
Unable to load recommendations.
Follow Us