Kim Sharma: టెన్నిస్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌తో కిమ్‌ శర్మ డేటింగ్‌.. వైరల్‌ అవుతోన్న గోవా హాలీడే ఫొటోలు.

Kim Sharma: నటి కిమ్‌ శర్మ.. టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ లియాండర్‌ పేస్ డేటింగ్‌లో ఉన్నారా? అంటే.. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు చూస్తుంటే అవుననే అనుమానం...

Kim Sharma: టెన్నిస్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌తో కిమ్‌ శర్మ డేటింగ్‌.. వైరల్‌ అవుతోన్న గోవా హాలీడే ఫొటోలు.
Kim Sharma Dating

Updated on: Jul 15, 2021 | 9:00 AM

Kim Sharma: నటి కిమ్‌ శర్మ.. టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ లియాండర్‌ పేస్ డేటింగ్‌లో ఉన్నారా? అంటే.. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు చూస్తుంటే అవుననే అనుమానం రాక మానదు. ప్రస్తుతం ఈ జంట గోవాలో హాలీడే ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోలు నెట్టింట హల్చల్‌ చేస్తున్నాయి. అయితే తొలుత కిమ్‌ శర్మ సముద్రపు ఒడ్డున సింగిల్‌గా దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఈ ఫొటో తీసింది మిస్టర్‌ ‘పి” అని క్యాప్షన్‌ జోడించారు. దీంతో ఈ మిస్టర్‌ ‘పి’ ఎవరా.? అని అంతా ఆలోచించారు. అయితే తర్వాత లియాండర్‌ పేస్‌తో దిగిన ఫొటోలు బయటకు రావడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలకు బలం చేకూరింది. ఇదిలా ఉంటే గతంలోనూ ఈ జంట ముంబయిలో పలుసార్లు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కంటికి చిక్కారు.

ఇక కిమ్‌శర్మ 2007లో భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే యువరాజ్‌ అనంతరం హెజిల్‌ కీచ్‌ను వివాహం చేసుకున్నాడు. తర్వాత 2010లో కిమ్‌ శర్మ కెన్యాకు చెందిన అలి పుంజానీ అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకున్నారు. 2016లో వీరిద్దరి మధ్య మనస్పార్థాలు రావడంతో విడిపోయారు. అనంతరం కొంతకాలం పాటు నటుడు హర్ష వర్ధన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో వీరిద్దరు సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.

Also Read: Radhika Apte: కొత్త అవతారమెత్తనున్న రాధికా ఆప్టే.. విక్రమ్‌ వేదా రీమేక్‌లో సరికొత్త పాత్రలో కనిపించనున్న..

Janhvi Kapoor: దివి నుంచి భువికి దిగివచ్చిన యాపిల్ బ్యూటీ.. ఈ కపూర్ క్యూటీ

ప్రొడ్యూసర్ ఆఫీస్ ముందు హంగామా చేసిన మహిళ.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చివరకు

Loading...
Unable to load recommendations.
Follow Us