Prithvi Ambaar: దియా మూవీ హీరో ఇంట తీవ్ర విషాదం.. అనారోగ్యంతో తల్లి కన్నుమూత..

గత కొద్ది రోజులుగా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన తల్లి సుజాత బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స

Prithvi Ambaar: దియా మూవీ హీరో ఇంట తీవ్ర విషాదం.. అనారోగ్యంతో తల్లి కన్నుమూత..
Prithvi Ambaar

Updated on: Jul 16, 2022 | 11:46 AM

దియా (Dia) ఫేమ్ హీరో పృథ్వీ అంబర్ (Prithvi Ambaar) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొద్ది రోజులుగా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన తల్లి సుజాత బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. దీంతో హీరో పృథ్వీ ఇంట విషాద చాయలు అలుముకున్నాయి. ఈరోజు సుజాత అంత్యక్రియలు వారి స్వగ్రామంలో జరగనున్నాయి. ఆమె మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

పృథ్వీ అంబర్ కన్నడ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యాడు. 2008లో ప్రసారమైన రాధా కళ్యాణం సీరియల్‏తో సినీ రంగ ప్రవేశం చేశాడు పృథ్వీ. ఆ తర్వాత జోతే జోతేయాలి తోపాటు పలు సీరియల్స్ లో నటించి పేరు తెచ్చుకున్నాడు. 2020లో విడుదలైన దియా సినిమాలో హీరోగా నటించి మెప్పించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యంగ్ హీరో దియా హిందీ రీమేక్‏లో నటిస్తున్నాడు.

Prithvi

ఈ సినిమా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు పృథ్వీ. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తుళు, కన్నడ చిత్రాలతోపాటు తమిళం, హిందీ చిత్రాల్లోనూ పృథ్వీ నటిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us