Hyderabad Police: గుర్తుపెట్టుకో సిన్నప్పా.. ఇక్కడున్నది హైదరాబాద్ పోలీసులు.. ఎవ్వరినీ వదలరు..

హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాను వాడుకోవడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలలో అవగాహన..

Hyderabad Police: గుర్తుపెట్టుకో సిన్నప్పా.. ఇక్కడున్నది హైదరాబాద్ పోలీసులు.. ఎవ్వరినీ వదలరు..
Cyberabad Police
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 23, 2021 | 12:31 PM

హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాను వాడుకోవడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఇంటర్నెంట్‏ను ఓ రేంజ్‏లో ఉపయోగించుకుంటారన్న సంగతి తెలిసిందే. ట్రెండ్‏ను ఫాలో అవుతూ.. ప్రజలకు తమదైన స్టైల్‏లో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తుంటారు. కేవలం ట్రాఫిక్ రూల్స్ పైనే కాకుండా.. కరోనా పై అవగాహన కూడా కల్పిస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాలలో మాస్క్ ధరించకపోయిన.. సామాజిక దూరం పాటించకపోయిన.. ఎదురయ్యే సమస్యల గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. హైదరాబాద్ ప్రాంత ప్రజలకు కరోనా పోలేదని.. ఇంకా ఉందని.. అందరూ జాగ్రత్తగా కోవిడ్ నిబంధనలు పాటించాలని గుర్తు చేస్తున్నారు.

వెంకటేశ్.. ప్రియమణి ప్రధాన పాత్రలలో.. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సినిమా నారప్ప. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైన ఈ మూవీ ప్రశంసలు అందుకుంటుంది. పలువురు సెలబ్రెటీలు.. సినీ విమర్శకులు సైతం ఈ సినిమా అద్భుతంగా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ పోలీసులు మరోసారి తమ ట్రెండీ టాలెంట్‏ను బయటకు తీశారు. కరోనా పట్ల అవాగాహ‌న క‌ల్పించేందుకు అన్ని అస్త్రాల‌ని వాడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాను ఎంచుకొని వారు షేర్ చేస్తున్న మీమ్స్ నెటిజ‌న్స్‌కి థ్రిల్ క‌లిగిస్తున్నాయి. డ్రైవింగ్‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు క‌రోనా జాగ్రత్తలు తెలియ‌జేస్తున్నారు.

Narappa

Narappa

తాజాగా నారప్ప సినిమా పోస్టర్‏ను ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం కరోనా విజృంబిస్తున్న వేళ ప్రతి ఒక్కు మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం ఎంతైన ఉందని అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో నారప్ప సినిమాలో వెంకటేష్ ముఖానికి మాస్క్ తగిలించి కరోనా ఇంకా ముగిసిపోలేదు. బయటకు వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి అంటూ మీమ్ క్రియేట్ చేశారు. క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయత్నంలో స‌జ్జనార్ షేర్ చేసిన ఫొటో వైర‌ల్ అవుతుంది. గతంలోనూ ఆర్ఆర్ఆర్ పోస్టర్ విడుద‌ల కాగా, బైక్‌పై ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌లు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని.. వారి పోస్టర్‏కు హెల్మెట్ అమర్చారు పోలీసులు.

ట్వీట్..

Also Read: Viral News: ఈ బుజ్జి ఏనుగు తెలివి అదుర్స్.. ఆకట్టుకుంటున్న వీడియో.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Viral Pic: జింకల మందపై ఎటాక్ చేసిన పెద్దపులి.. ఈ ఫోటోలో అదెక్కడ ఉందో కనిపెట్టండి బాసూ.!

Latest Articles