
సోషల్ మీడియాలో అలియా భట్ కేన్స్ టుక్ ఫోటోలు విడుదలైన నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. అలియా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలను షేర్ చేస్తూ “CANNES 2026” అని క్యాప్షన్ ఇచ్చారు. అలియా ధరించిన ఈ గౌను కేవలం ఒక దుస్తువు మాత్రమే కాదు, అదొక అందమైన కళాఖండం. దీని వెనుక ఉన్న కొన్ని విశేషాలేంటో తెలుసుకుందాం..
ఈ గౌనును 1950ల నాటి ప్రసిద్ధ సిల్హౌట్‌ల నుండి స్ఫూర్తి పొంది తయారు చేశారు. ఇందులో వింటేజ్ స్టైల్‌ను ఆధునిక ఎలిగెన్స్‌తో కలగలిపారు. ఈ గౌనులో యాంగ్యులర్ కప్స్‌తో కూడిన బాడీస్, డ్రాప్ వేస్ట్ మరియు సిల్క్ ఆర్గాంజా, టల్లే లేయర్లతో కూడిన భారీ స్కర్ట్ ఉన్నాయి. ఈ గౌనుపై బాసూరి చోక్సీ చేతితో గీసిన పెయింటింగ్ హైలైట్‌గా నిలిచింది. ఫ్రెంచ్ రివేరాలోని సుందర దృశ్యాలు, లావెండర్ పొలాలు మరియు రొమాన్స్‌ను ప్రతిబింబించేలా ఈ పెయింటింగ్‌ను రూపొందించారు.
అలియా తన మేకప్ మరియు హెయిర్ స్టైల్ విషయంలో ఎంతో జాగ్రత్త వహించారు. గౌను యొక్క స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ హైలైట్ అయ్యేలా ఆమె ‘ఫ్రెంచ్ బన్’ హెయిర్ స్టైల్‌ను ఎంచుకున్నారు. మేకప్‌ను ఎంతో సహజంగా ఉంచారు. న్యూడ్ పింక్ గ్లాసీ లిప్స్, షిమ్మరీ బ్రౌన్ ఐషాడో, బుగ్గలపై కొద్దిగా పింక్ బ్లష్‌తో ఆమె లుక్ పూర్తి అయ్యింది. ఆభరణాల విషయానికి వస్తే, కేవలం చిన్న ఇయర్ రింగ్స్ ఉంగరాలతో సింపుల్‌గా మెరిశారు. కేన్స్ ప్రధాన వేదికపైకి రాకముందే, అలియా ‘కరోలినా హెర్రెరా’ డిజైన్ చేసిన ఆల్-బ్లాక్ అవుట్‌ఫిట్‌తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నారు. ఈ లుక్ 2026లో ‘క్యాప్రిస్’ (Capris) ట్రెండ్ కాబోతున్నాయని హింట్ ఇచ్చింది.