
90ల దశకంలో టాలీవుడ్, కోలీవుడ్ , బాలీవుడ్ చిత్ర పరిశ్రమలను తమ అద్భుతమైన అందచందాలతో, అభినయంతో ఏలిన అగ్రశ్రేణి కథానాయికలు రమ్యకృష్ణ , నగ్మా. తెలుగులో టాప్ హీరోస్ అందరితో నటించి మెప్పించారు. అప్పట్లో రొమాంటిక్ చిత్రాల నుంచి పవర్ఫుల్ పాత్రల వరకు అన్ని జోనర్లలోనూ నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు, ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఒక అరుదైన , పాత ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్యలో ఉన్న ఓ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? సామాజిక మాధ్యమాలలో తరచూ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు లేదా పాత షూటింగ్ స్పాట్ పిక్స్ వైరల్ కావడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా వెలుగు చూసిన ఈ ఫొటోలో రమ్యకృష్ణ , నగ్మా ఎంతో యంగ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో ఉన్న ఆ కుర్రాడు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫేమస్. అతడి పేరు నెట్టింట ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటుంది.
ఎక్కువ మంది చదివినవి : Balakrishna: బాలకృష్ణకు లవర్‌గా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
నుదుటున బొట్టు, నూనూగు మీసాలతో కనిపిస్తున్న ఆ కుర్రాడు మరెవరో కాదు.. ఎప్పుడు నెట్టింట జాతాకలతో యాక్టివ్ గా ఉండే వేణు స్వామి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు చిత్రం ప్రారంభోత్సవ పూజా సమయంలో తీసిన అరుదైన ఫోటో ఇది. ఇప్పుడు ఇదే పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. వేణు స్వామి సినీ ప్రయాణం ఇప్పుడు మొదలైంది కాదని అంటున్నారు. అప్పట్లో స్టార్ హీరోస్ సినిమాల పూజా కార్యక్రమాల్లో వేణు స్వామి పాల్గొనేవారని తెలుస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..
ఒకప్పుడు పూజా కార్యక్రమాలలో పాల్గొన్న వేణు స్వామి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రెటీ అనే చెప్పాలి. హీరోహీరోయిన్స్ ఆయనతో చేసే ప్రత్యేక పూజలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ తెగ హల్చల్ చేశాయి. అలాగే ఇన్ స్టాలో ఎప్పుడూ ఏదోక విషయంపై జాతకాలు, పూజల గురించి చెబుతూ యాక్టివ్ గా ఉంటుంటాడు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‌తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..
v
ఎక్కువ మంది చదివినవి : Idupu Kayitham: ఇడుపు కాయితం నుంచి గడప సాంగ్ రిలీజ్.. ప్రతి అమ్మాయి హృదయాలను హత్తుకునే పాట..