Tollywood : ఒకప్పుడు స్కూల్ టీచర్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

ఒకప్పుడు బెంగుళూరులో స్కూల్ టీచర్‌గా, యోగా శిక్షకురాలిగా పనిచేసిన అందాల భామ టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఆమె పాత రోజులకు సంబంధించిన అరుదైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టండి..

Tollywood : ఒకప్పుడు స్కూల్ టీచర్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
Anushka Shetty

Updated on: Oct 10, 2026 | 9:21 AM

సాధారణంగా సోషల్ మీడియాలో సినీ తారల చిన్ననాటి ఫొటోలు, మోడలింగ్ రోజుల నాటి త్రోబ్యాక్ పిక్స్ తరచూ వైరల్ అవుతుంటాయి. అభిమానులు కూడా తమ అభిమాన హీరో హీరోయిన్ల పాత ఫొటోలను గుర్తుపట్టడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు స్కూల్లో టీచర్‌గా పనిచేసి, ఆ తర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఓ లేడీ సూపర్ స్టార్ త్రోబ్యాక్ పిక్ ప్రస్తుతం నెట్టింట తీవ్రంగా ట్రెండ్ అవుతోంది.పైన ఫొటోలో కనిపిస్తున్న ఆ అందాల భామ మరెవరో కాదు.. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అనుష్క శెట్టి. సినిమాల్లోకి రాకముందు ఈ కన్నడ సుందరి బెంగళూరులోని ఈస్ట్‌వుడ్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా, అలాగే యోగా టీచర్ గా పనిచేసేవారు. ఆ సమయంలో ఆమెను చూసిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆమెలోని నటిని గుర్తించి టాలీవుడ్‌కి పరిచయం చేశారు. నాగార్జున, సోనూసూద్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సూపర్’ చిత్రంతో అనుష్క వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు.

ఎక్కువమంది చదివినవి: Bathukamma Song : యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మంగ్లీ కొత్త బతుకమ్మ పాట.. గంటల్లోనే 

గ్లామరస్ పాత్రలతో కెరీర్ ప్రారంభించిన అనుష్క, స్వల్ప సమయంలోనే తన నటనతో అందరినీ మెప్పించారు. ముఖ్యంగా కడియాల కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అరుంధతి’ చిత్రం అనుష్క కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో ‘జేజమ్మ’ పాత్రలో ఆమె చూపించిన నటన, గంభీరత బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించాయి. ఆ తర్వాత ‘వేదం’ చిత్రంలో వేశ్య పాత్రలో, ‘సైజ్ జీరో’ కోసం బరువు పెరిగి చేసిన ప్రయోగాలు ఆమె యాక్టింగ్ డెడికేషన్‌కు నిదర్శనం.

ఎక్కువమంది చదివినవి: Jaya Prada: ఆ హీరోకు అత్తగా నటించా.. అతడు అంటే నాకు పిచ్చి ఇష్టం.. జయప్రద..

దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీలో దేవసేనగా అనుష్క ప్రదర్శించిన రాజసమైన నటన దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయంగానూ ప్రశంసలు అందుకుంది. ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించి టాలీవుడ్‌లోనే ఏకైక లేడీ సూపర్ స్టార్‌గా నిలిచారు. ‘ఘాటి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్వీటీ శెట్టి పాత స్కూల్ టీచర్ రోజులకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఎక్కువమంది చదివినవి: Nana Patekar : నా ఆస్తి ఆ 12 ఎండు కట్టలే.. నేను ముందే పక్కన పెట్టుకున్నా.. నానా పటేకర్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..

అనుష్క శెట్టి..

ఎక్కువమంది చదివినవి: Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్ పర్సన్.. నటనలో మా ఇద్దరికీ పోటీ ఉండేది.. హీరో శ్రీకాంత్..

Loading...
Unable to load recommendations.
Follow Us