బాలీవుడ్ ప్రముఖ నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన డ్రెస్సులు వేస్తూ బోల్డ్ పర్సనాలిటీగా పేరు తెచ్చుకుందీ అందాల తార. అయితే ఒక్కోసారి ఈ అమ్మడి యవ్వారం హద్దులు దాటుతుంటుంది. అందుకే చాలా మంది ఉర్ఫీని ట్రోల్ చేస్తుంటారు. అయితే ఈ సొగసరి తీరు మాత్రం మారదు. అదే సమయంలో తనను తక్కువ చేసి మాట్లాడితే ఏ మాత్రం సహించదు. వెంటనే కౌంటర్లు ఇస్తుంది. తాజాగా ఉర్ఫీ జావేద్ కు చేదు అనుభవం ఎదురైంది. తల్లిదండ్రులు, అభిమానుల ముందే ఆమెకు ఓ అసభ్యకరమైన ప్రశ్న వేశాడు ఓ 15 ఏళ్ల కుర్రాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుని వాపోయింది.
‘నిన్న నా కుటుంబం ముందు చాలా బాధించే సంఘటన జరిగింది. కెమెరామెన్లు నన్ను ఫోటోలు తీస్తుండగా ఒక కుర్రాళ్ల గుంపు నా ముందు నుంచి వెళ్లింది. అందులో ఒక బాలుడు ‘నీ బాడీ కౌంట్ ఎంత’? అని అడిగాడు. అబ్బాయికి దాదాపు 15 ఏళ్లు కూడా లేవు. నా కుటుంబం, తల్లి ముందు అలా అడిగడంతో నేను షాక్ అయ్యాను. ఆ అబ్బాయిని అందరి ముందు ముందు కొట్టాలి అనుకున్నాను. నేను ఈ అబ్బాయి తల్లిదండ్రుల పట్ల జాలిపడుతున్నాను. స్త్రీలను, ప్రజలందరినీ గౌరవించడం మీ అబ్బాయిలకు నేర్పండి ‘ అని ఉర్ఫీ జావేద్ ఎమోషనల్ అయిపోయింది.
ఉర్ఫీ జావేద్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించే వెబ్ షో విడుదలైంది. ‘ఫాలో కల్ లో యార్’ పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఉర్ఫీ జావేద్ ఈ వెబ్ షో ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంటోంది. ప్రమోషన్ సమయంలో బాలుడి నుంచి ఉర్ఫీకి అసభ్యకరమైన ప్రశ్న ఎదురైంది. ఉర్ఫీకి అనుకూలంగా పలువురు గళం విప్పారు. పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.