Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం.. కాల్పుల ఘటనపై ఏమన్నారంటే?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం (ఏప్రిల్ 16) ముంబైలోని బాంద్రా నివాసంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను కలిశారు. ఆదివారం (ఏప్రిల్ 14) సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే సల్మాన్ ని కలిశారు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం.. కాల్పుల ఘటనపై ఏమన్నారంటే?
Cm Eknath Shinde, Salman Kh
Follow us

|

Updated on: Apr 16, 2024 | 8:35 PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం (ఏప్రిల్ 16) ముంబైలోని బాంద్రా నివాసంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను కలిశారు. ఆదివారం (ఏప్రిల్ 14) సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే సల్మాన్ ని కలిశారు. కాల్పుల విషయంలో చర్యలు తీసుకుంటామని సల్మాన్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈసారి ఏకనాథ్ షిండే సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు విధిస్తామని సీఎం గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం సల్మాన్‌ఖాన్‌ నివాసానికి వెళ్లిన వీడియో వైరల్‌గా మారింది. ‘సల్మాన్ ఖాన్‌ని కలిశాను. మా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలియజేశాను. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఇది మహారాష్ట్ర. ఏ ముఠా ఇక్కడ ఉండలేదు. మేము అన్ని ముఠాలు, గూండాలను నాశనం చేస్తాం. ఇక్కడ రౌడీయిజం కొనసాగడానికి వీలు లేదు’ అని ఏక్‌నాథ్ షిండే మీడియాతో చెప్పుకొచ్చారు.

‘ముంబైలో అండర్ వరల్డ్ అంతమైపోయింది. ఈ లారెన్స్ బిష్ణోయ్‌ పని కూడా పడతాం. ఇంకోసారి ఇలా చేయడానికి ఎవరూ సాహసించకూడదు. పోలీసుల పని తీరు ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఏమీ జరగదు. సల్మాన్ ఖాన్ పెద్ద సెలబ్రిటీ. ఎవరైనా సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు’ అని ప్రజలకు భరోసా ఇచ్చారు సీఎం. మహారాష్ట్రలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఏక్‌నాథ్ షిండే బదులిస్తూ.. ‘గత ప్రభుత్వాలు ఏం చేశాయో నేను మాట్లాడటం లేదు. ప్రస్తుత కాల్పుల ఘటనను కూడా నేను సమర్థించడం లేదు. ముంబై ప్రజలపై చేతులు ఎత్తేసిన దుర్మార్గులకు తగిన గుణపాఠం చెబుతామని ఏక్నాథ్ షిండే మీడియా ముందు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

సీఎంకు స్వాగతం పలుకుతోన్న సల్మాన్.. వీడియో..

మీడియాతో మాట్లాడుతున్న ఏక్ నాథ్ షిండే.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..