హీరోయిన్ కిమ్ శర్మ.. ఇండియన్ ఏస్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ ఫేస్‌తో ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. దీంతో నిజాంగానే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. కిమ్ శర్మ ప్రేమలో పడడం కొత్తేమి కాదు.. కెరీర్ ఆరంభంలోనే క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతోనూ కిమ్ శర్మ్ డేటింగ్ చేస్తున్నట్లుగా అప్పట్లో వార్తలు వినిపించాయి.
కిమ్ శర్మ గతంలో కెన్యాకు చెందిన వ్యాపారవేత్త కం డాన్ అలీ పుంజానీ వివాహం చేసుకుందని.. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారని ప్రచారమైంది. ఇక ఆ తర్వాత కిమ్.. తిరిగి బాలీవుడ్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో యంగ్ హీరో హర్షవర్ధన్ రాణేతో ప్రేమలో పడింది. కిమ్ శర్మ.. తెలుగులో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, రవితేజ ప్రధాన పాత్రలలో నటించిన ఖడ్గం సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక హర్షవర్ధన్ రాణే.. భూమిక నిర్మించిన తకిట తకిట అనే చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. కిమ్ – రాణే ఓ బాలీవుడ్ చిత్రంలో నటించేప్పుడు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొంతకాలానికే ఈ జంట విడిపోయింది.తాజాగా కిమ్.. టెన్నిస్ స్టార్ లియాండర్ ఫేస్‌తో ప్రేమలో పడినట్లుగా టాక్ బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అంతేకాదు.. వీరిద్దరు కలిసి ముంబైలో చాలాసార్లు జంటగా కనిపించారు. అయితే ప్రస్తుతం ఈ జంట గోవా బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో నిజాంగానే కిమ్ ప్రేమలో ఉన్నట్లుగా అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే.. కిమ్ శర్మ, లియాండర్ ఫేస్ ప్రేమాయణంపై ఆమె మాజీ ప్రియుడు హర్షవర్ధన్ రాణే స్పందించాడు. కిమ్ శర్మ గురించి వస్తున్న వార్తలపై తనకు ఇప్పటికీ పూర్తి అవగాహన లేదని.. ఒకవేళ నిజాంగానే కిమ్ అతడితో ప్రేమలో ఉంటే మాత్రం.. నగరంలోనే వారిద్దరూ మంచి జోడి అని పేర్కోన్నాడు.