Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పెళ్లిపై ఇప్పటికే ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. ఆ హీరోతో పెళ్లి.. ఈ హీరోతో ప్రేమ అంటూ నిత్యం రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. 38 ఏళ్ల ఈ పొడుగు కాళ్ళ సుందరి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన మల్లేశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత బాలకృష్ణ సరసన అల్లరి పిడుగు అనే సినిమాలో చేసింది. ఈసినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో ఈ భామ తిరిగి బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ వరుస ఆఫర్లు అందుకొని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక కత్రినా కైఫ్ గతంలో రణ్ బీర్ కపూర్‌తో ప్రేమాయణం నడిపించిందని వార్తలు వినిపించాయి. ఈ ఇద్దరు కలిసి పార్టీలకు, విదేశాలకు వెళ్తూ పలుసార్లు మీడియా కంటపడ్డారు. ఆ తర్వాత కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కత్రినా పెళ్లి అంటూ గుసగుసలువినిపించాయి. కత్రినా-సల్మాన్ చాలా కాలంగా లవ్ స్టోరీ నడిపించారంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు కత్రినా సీక్రెట్‌గా ఎంగేజ్ మెంట్ చేసుకుందని తెలుస్తుంది.
బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్‌తో కత్రినా ఎంగేజ్‌మెంట్ అయ్యిందంటూ ఓ వార్త ఇప్పుడు హల్‌చల్ చేస్తుంది. ఈ ఇద్దరు సీక్రెట్‌గా రింగులు మార్చుకున్నారంటూ బాలీవుడ్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. విక్కీ కౌశల్ ఉరి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో బాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :