Farhan weds Shibani: యువ నటితో ఏడడుగులు నడిచిన ఫర్హాన్‌.. పెళ్లి వేడుకలో సందడి చేసిన బాలీవుడ్‌ సెలబ్రిటీలు..

నటుడు, డైరెక్టర్‌, స్ర్కీన్‌ రైటర్‌, ప్లేబ్యాక్‌ సింగర్‌, ప్రొడ్యూసర్‌, యాంకర్‌.. ఇలా బహుముఖ ప్రజ్ఞతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఫర్హాన్‌ అక్తర్‌ (Farhan Akthar)

Farhan weds Shibani: యువ నటితో ఏడడుగులు నడిచిన ఫర్హాన్‌.. పెళ్లి వేడుకలో సందడి చేసిన బాలీవుడ్‌ సెలబ్రిటీలు..
Farhan Weds Shibani

Updated on: Feb 19, 2022 | 9:28 PM

నటుడు, డైరెక్టర్‌, స్ర్కీన్‌ రైటర్‌, ప్లేబ్యాక్‌ సింగర్‌, ప్రొడ్యూసర్‌, యాంకర్‌.. ఇలా బహుముఖ ప్రజ్ఞతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఫర్హాన్‌ అక్తర్‌ (Farhan Akthar).  ‘భాగ్ మిల్కా భాగ్’, ‘తూఫాన్’ చిత్రాలతో హీరోగానూ మంచి విజయాలు సొంతం చేసుకున్నాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ మల్టీ ట్యాలెంటెడ్‌ యాక్టర్ నాలుగేళ్లుగా మోడల్‌, నటి శిబానీ దండేకర్‌ (Shibani Dandekar) తో ప్రేమలో ఉన్నాడు. గత కొద్ది కాలంగా వీరిద్దరి వివాహంపై పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి. తాజాగా వీటికి ముగింపు పలికాడు ఫర్హాన్‌. తన నాలుగేళ్ల ప్రేమను మూడుముళ్ల బంధంగా మార్చుకున్నాడు. శిబానీ దండేకర్‌తో ఏడడుగులు నడిచి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. శనివారం (ఫిబ్రవరి19) ముంబయిలోని ఖండాలాలో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హృతిక్ రోషన్, రియాచక్రవర్తి, అనుషా దండేకర్, ఫరాఖాన్‌ తదితర బాలీవుడ్ ప్రముఖులు ఫర్హాన్‌- శిబానీల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఫర్హాన్‌ దంపతులకు అభినందనలు చెబుతున్నారు. . ఫర్హాన్ అక్తర్‌కు గతంలోనే అధునా బబానీతో వివాహాం అయింది. వీరిద్దరికి షక్యా, అఖీరా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అనివార్య కారణాలతో 2017లో ఈ జంట విడాకులు తీసుకుంది. బబానీతో బ్రేకప్‌ అయ్యాక శిబానీ దండేకర్‌లో ప్రేమను వెతుక్కున్నాడు ఫర్హాన్‌. తాజాగా ఆమెతో పెళ్లి పీటలెక్కాడు. కాగా కరోనా ఆంక్షల మధ్య జరిగిన వివాహానికి అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అన్నట్లు ఫర్హాన్‌ అక్తర్‌కు టాలీవుడ్‌ హీరోలతోనూ మంచి సాన్నిహిత్యముంది. మహేశ్‌ బాబు హీరోగా నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమాలోని ‘ఐ డోంట్‌ నో’ సాంగ్‌ను ఆలపించింది అతనే.

 

Loading...
Unable to load recommendations.
Follow Us