Ajay Devgn : వరుస సినిమాలతో బిజీ బిజీగా బాలీవుడ్ హీరో.. మరో సినిమాను లైన్‌‌‌‌‌లో పెట్టిన అజయ్ దేవగన్

|

Feb 05, 2021 | 8:35 PM

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు...

Ajay Devgn : వరుస సినిమాలతో బిజీ బిజీగా బాలీవుడ్ హీరో.. మరో సినిమాను లైన్‌‌‌‌‌లో పెట్టిన అజయ్ దేవగన్
Follow us on

Ajay Devgn : బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇక బాలీవుడ్ లో బిజీ హీరోల్లో అజయ్ ఒకరు. నటుడిగా నిర్మాతగా వరుస సినిమాతో దూసుకు పోతున్నాడు అజయ్. ఈ క్రమంలో త్వరలో మరో ప్రాజెక్ట్ ను మొదలు పెట్టనున్నాడట ఈ హీరో.  బేబీ.. స్పెషల్ చెబ్బీస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు నీజర్ పాండే ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

ఇటీవల హిస్టారికల్ మూవీ ‘తనాజీ’ సినిమాతో ఆకట్టుకున్న అజయ్ దేవగన్ ఈ సారి చాణక్య సినిమాతో మెప్పించేందుకు సిద్దం అవుతున్నాడు. చాణుక్యుడి  పాత్ర ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక అజయ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ తోపాటు ‘మైదాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అటు నిర్మాతగా అమితాబ్, రకుల్ ప్రధాన పాత్రలో ‘మేడే’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం చాణక్య సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీ వార్తలు చక్కర్లుకొడుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

అరుదైన ఘనత సాధించిన కీర్తిసురేశ్.. ‘ఫోర్బ్స్’ ఇండియా 2021లో చోటు దక్కించుకున్న ‘మహానటి’..