Actress Kriti Sanon : ఇంతకు ముందు ఎప్పుడు చేయని పాత్ర ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం చేస్తానంటున్న బ్యూటీ..

|

Feb 10, 2021 | 3:09 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ 1 నేనొక్కడినే ‘ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్. ఆతర్వాత తెలుగులో నాగచైతన్య ..

Actress Kriti Sanon : ఇంతకు ముందు ఎప్పుడు చేయని పాత్ర ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం చేస్తానంటున్న బ్యూటీ..
Follow us on

Actress Kriti Sanon : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ 1 నేనొక్కడినే ‘ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్. ఆతర్వాత తెలుగులో నాగచైతన్య నటించిన దోచేయ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేక పోయింది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ కు తిరిగి చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ అయిపోయింది. కాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

అయితే లాక్ డౌన్ తర్వాత ఓటీటీ కి క్రేజ్ పెరిగిన విషయం తెలిసిందే. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా  కొన్ని సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా కృతిసనన్ మాట్లాడుతూ.. ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం ఏదైనా ఒక ప్రాజెక్టు చేయాల‌నుకుంటున్నా. ఇంతకు ముందు ఎప్పుడు చేయని పాత్ర ఏదైనా చేయాలనీ ఉంది అంటూ మనసులోని మాట బయట పెట్టేసింది. అలాగే నేను కూడా ఓటీటీలో సినిమాలు చూసి ఎంజాయ్ చేశా. బాక్సాపీస్ నంబ‌రింగ్ గురించి ఆలోచించే అవ‌స‌రం లేకుండా నువ్వు ఏం తీయాల‌నుకుంటున్నావో..అది రూపొందించే అవ‌కాశం ఉంటుంది ఓటీటీలో అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actor Satyadev : ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసిన హీరో సత్యదేవ్.. సోషల్ మీడియాలో వైరల్