Kiara Advani: ఏంటమ్మ కియారా ఇలా చేసావు.. తప్పు కదు.. హీరోయిన్‏పై మండిపడుతున్న నెటిజన్లు..

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం టాప్ హీరోయిన్‏గా రాణిస్తుంది. హిందీతోపాటు, తెలుగులోనూ వరుస అవకాశాలను అందుకుంటుంది.

Kiara Advani: ఏంటమ్మ కియారా ఇలా చేసావు.. తప్పు కదు.. హీరోయిన్‏పై మండిపడుతున్న నెటిజన్లు..
Kiara Advani

Updated on: Jul 09, 2021 | 7:35 AM

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం టాప్ హీరోయిన్‏గా రాణిస్తుంది. హిందీతోపాటు, తెలుగులోనూ వరుస అవకాశాలను అందుకుంటుంది. ‘ఫగ్లీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కియారా ఆదిలోనే పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత ‘కబీర్ సింగ్’ సినిమాతో హిట్ అందుకుంది. ఇక మహేష్ సరసన ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాలతో తెలుగులోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ అమ్మడు పై ఇప్పుడు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం కియారా కారు దిగడమే. అదెంటీ కారు దిగడం వల్ల ట్రోల్ చేయడమేంటి అనుకుంటున్నారా ?

ఇటీవల కియారా అద్వానీ బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ మల్హోత్రా ఇంటికి వెళ్లింది. అయితే అతని ఇంటి ముందు కారు ఆపిన తర్వాత ఒక వృద్దుడు వచ్చి కారు డోర్ ఓపెన్ చేస్తూ.. ఆమెకు సెల్యూట్ చేశాడు. కానీ కియారా అదేం పట్టనట్లుగా కార్ దిగి బిల్డింగ్‏లోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకేముంది… ఇవి చూసిన నెటిజన్లు కియారా తీరుపై మండిపడుతున్నారు. తలుపు తెరవడం రాదా అని.. తండ్రి వయసులో ఉన్న వ్యక్తితో అతని నుంచి సెల్యూట్ తీసుకోవడం ఏంటీ ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే గత కొద్ది రోజులుగా యంగ్ హీరో సిద్దార్థ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రేమలో ఉన్నట్లుగా బాలీవుడ్‏లో టాక్ వినిపిస్తోంది. ఈ జంట విహారాలకు తిరుగుతూ పలుమార్లు మీడియా కంటపడ్డారు. వీరిద్దరూ ‘షెర్షా’ సినిమాలో నటించారు.

ట్వీట్..

Also Read: Amma Vodi Laptops: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. ఉత్తర్వులు జారీ

Teen Thrashed: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. దొంగగా భావించి బాలుడిని కొట్టి చంపిన ఫామ్‌హౌస్‌ యజమాని

Corona Third Wave : కరోనా థర్డ్ వేవ్ చాలా డేంజర్..! హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు.. కఠిన నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి