Kangana Ranaut: ‘రేప్‌లు, మర్డర్లు జరిగినా పర్వాలేదా?’ చెంప దెబ్బ కొట్టిన కానిస్టేబుల్‌ను సమర్థించడంపై కంగనా

ప్రముఖ బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌కు ఇటీవల ఒక చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన కుల్విందర్ కౌర్ అనే మహిళా ఉద్యోగి కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టింది. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది

Kangana Ranaut: 'రేప్‌లు, మర్డర్లు జరిగినా పర్వాలేదా?' చెంప దెబ్బ కొట్టిన కానిస్టేబుల్‌ను సమర్థించడంపై కంగనా
Actress Kangana Ranaut
Follow us

|

Updated on: Jun 09, 2024 | 9:32 PM

ప్రముఖ బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌కు ఇటీవల ఒక చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన కుల్విందర్ కౌర్ అనే మహిళా ఉద్యోగి కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టింది. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. దీనిపై స్పందించిన సీఐఎస్ఎఫ్ కుల్విందర్ కౌర్ పై సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. విచారణ జరుగుతోంది. ఇది కాకుండా ఈ ఘటనలో కుల్విందర్ కౌర్ తీరును పలువురు ఖండించారు. ఆమె ఇలా చేయి చేసుకోవాల్సింది కాదంటూ సూచించారు. అదే సమయంలో మరికొందరు కుల్విందర్ కౌర్ మద్దతుగా నిలిచారు. తాజాగా ఈ ఘటనపై మరోసారి కంగనా రనౌత్ స్పందించింది. ‘ఇక అత్యాచారాలు, హత్యలు జరిగినా మీకేం ఫర్వాలేదా?’ అంటూ ట్విట్టర్ వేదికగా సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్‌కు మద్దతిచ్చిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

‘అత్యాచారానికి పాల్పడినవాడు.. హంతకుడు.. దొంగ.. ఇలా నేరం చేసినవారు ఎవరైనా భావోద్వేగ, మానసిక, ఆర్థికపరమైన కారణాలు చెబుతుంటారు. కారణం లేకుండా ఏ నేరం జరగదు. అయినా సరే చేసిన నేరానికి వారిని దోషిగా తేల్చి శిక్ష విధిస్తారు. అలా కాదని చట్టాన్ని ఉల్లంఘించి నేరాలకు పాల్పడిన క్రిమినల్స్‌ ఎమోషన్స్ కు విలువిస్తే.. అనుమతి లేకుండా ఓ వ్యక్తి శరీరాన్ని తాకడం, వారిపై దాడి చేయడం వంటి ఘటనలను మీరు సమర్థిస్తే.. అత్యాచారాలు, హత్యల వంటివి జరిగినా మీకేం ఫర్వాలేదనే అర్థం. మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. దయచేసి మీరు ధ్యానం, యోగా చేయండి. లేకపోతే జీవితం చేదుగా, భారంగా మారుతుంది. ఇంత చెత్త, ద్వేషం, అసూయలు మోయకండి. వాటి నుంచి త్వరగా విముక్తి పొందండి’ అని కంగనా రనౌత్ ట్విట్టర్‌లో సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం కంగనా రనౌత్ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కంగనా రనౌత్‌పై దాడి చేసిన కుల్విందర్ కౌర్ తరపున గాయకుడు విశాల్ దద్లానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కుల్విందర్‌ను తొలగిస్తే, ఆమె కోసం మంచి ఉద్యోగం ఇప్పిస్తానని విశాల్ చెప్పాడు. అలాంటి వారి కోసమే కంగనా రనౌత్ ఈ పోస్ట్ చేసింది. అయితే ఎక్కడా నేరుగా పేరు ప్రస్తావించలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఎన్ని ట్యాబ్లెట్స్‌ వేసుకున్నా తలనొప్పి తగ్గడం లేదా.? ఇలా చేస్తే
ఎన్ని ట్యాబ్లెట్స్‌ వేసుకున్నా తలనొప్పి తగ్గడం లేదా.? ఇలా చేస్తే
టెలికాం కంపెనీల వద్ద 254 కోట్ల మొబైల్ నంబర్లు: ట్రాయ్‌ నివేదిక
టెలికాం కంపెనీల వద్ద 254 కోట్ల మొబైల్ నంబర్లు: ట్రాయ్‌ నివేదిక
సూపర్ 8కు ముందు టీమిండియాకు ఊహించని షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం
సూపర్ 8కు ముందు టీమిండియాకు ఊహించని షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం
ఏపీ ప్రజలూ బీ అలెర్ట్.. ఇక వానలే వానలు.!
ఏపీ ప్రజలూ బీ అలెర్ట్.. ఇక వానలే వానలు.!
కబోర్డ్‏లో పెట్టిన బర్గర్.. 5 ఏళ్ల తర్వాత చూసి షాక్..
కబోర్డ్‏లో పెట్టిన బర్గర్.. 5 ఏళ్ల తర్వాత చూసి షాక్..
పండ్లు, కూరగాయలతో వెళ్తున్న 10 కంటైనర్లు.. అనుమానంతో తెరచి చూడగా
పండ్లు, కూరగాయలతో వెళ్తున్న 10 కంటైనర్లు.. అనుమానంతో తెరచి చూడగా
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
టీ20 మాన్‌స్టర్‌రా.. ఈ ప్లేయర్! ఒక్క ఓవర్‌లో 36 పరుగులు..
టీ20 మాన్‌స్టర్‌రా.. ఈ ప్లేయర్! ఒక్క ఓవర్‌లో 36 పరుగులు..
వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఏయే రంగాల వారు ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు
వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఏయే రంగాల వారు ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు
విజయ్ సేతుపతి పాదాలకు నమస్కరించిన డైరెక్టర్.. కారణమేంటో తెలుసా?
విజయ్ సేతుపతి పాదాలకు నమస్కరించిన డైరెక్టర్.. కారణమేంటో తెలుసా?
ఏపీ ప్రజలూ బీ అలెర్ట్.. ఇక వానలే వానలు.!
ఏపీ ప్రజలూ బీ అలెర్ట్.. ఇక వానలే వానలు.!
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.
తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.
రవిబాబు డైరెక్షన్లో.. క్రేజీ సినిమా మిస్ చేసుకున్న రౌడీ హీరో..
రవిబాబు డైరెక్షన్లో.. క్రేజీ సినిమా మిస్ చేసుకున్న రౌడీ హీరో..
మహేష్‌ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ పక్కా! నెట్టింట ట్రెండింగ్‌ పిక్స్
మహేష్‌ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ పక్కా! నెట్టింట ట్రెండింగ్‌ పిక్స్
శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.! దర్శన్‌ కేసుపై సుదీప్..
శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.! దర్శన్‌ కేసుపై సుదీప్..
'నా కూతురు కోసం పూర్తిగా మారిపోయా..' చరణ్ ఎమోషనల్ కామెంట్స్..
'నా కూతురు కోసం పూర్తిగా మారిపోయా..' చరణ్ ఎమోషనల్ కామెంట్స్..
మామయ్యకు ప్రేమతో ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు..
మామయ్యకు ప్రేమతో ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు..
గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..
గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..
కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?
కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?