
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్కు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. దాదాపు మూడు దశాబ్ధాల సినీ కెరీర్లో కాజోల్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి.. టాప్ హీరోయిన్స్ స్థానంలో సుధీర్ఘ కాలం కొనసాగింది. తెలుగులో ప్రభుదేవా సరసన మెరుపు కళలో సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోల సరసన నటిస్తూ.. వరుస సినిమాలతో కెరీర్ ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే కాజల్ పెద్ద సాహాయం చేసింది. ఆమె నటించిన సూపర్ హిట్ చిత్రాలలో 1997లో విడుదలైన గుప్త్.. ది హిడెన్ ట్రూత్ సినిమా ఒకటి. రాజీవ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మనీషా కొయిరాల, బాబీ డియోల్ కీలక పాత్రలలో నటించగా.. పరేశ్ రావల్, ఓం పురి, రాజ్ బబ్బర్, ప్రేమ్ చోప్రా, దలీప్ తహిల్, ప్రియా టెండూల్కర్ ముఖ్య పాత్రలు పోషించారు.
అయితే ఈ సినిమాలో కాజోల్ ప్రతినాయిక పాత్రలో నటించి .. ప్రశంసలు అందుకుంది. అప్పటీ వరకు స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నా కాజోల్ ఈ పాత్రకు ఓకే చెప్తుందా అని అందరూ సందేహించారట. అనుమానంగానే డైరెక్టర్ రాజీవ్ రాయ్.. కాజోల్కు సినిమా స్టోరీని వివరించారట. కానీ కాజోల్ కథ వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కెరీర్ మంచి జోష్ మీదున్న సమయంలో కాజోల్ విలన్ పాత్రకు ఓకే చెప్పడం అప్పట్లో పెద్ద సాహసమే. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే కాజోల్ కెరీర్ పై దారుణంగా మారిపోయి ఉండేదని ఇప్పటికీ సినీ ప్రముఖులు అంటుంటారు. కానీ సీనిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో కాజోల్ నటనకు ఏకంగా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది. ఈరోజు కాజోల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె భవిష్యత్తులో మరిన్ని పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాలని.. బర్త్ విషెస్ తెలుపుతుంది టీవీ9 తెలుగు.
ట్వీట్..