Aamir Khan: కూర్చుంటే మందు బాటిల్‌ ఖాళీ కావాల్సిందే.. కానీ ఇప్పుడు!.. ఆమిర్‌ ఖాన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

ఆమిర్‌ ఖాన్‌.. బాలీవుడ్‌లో మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌గా పేరున్న ఈ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిందీ చలన చిత్ర పరిశ్రమలో టాప్‌ హీరోగా వెలుగొందుతోన్న ఆయనకు తెలుగులోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు.

Aamir Khan: కూర్చుంటే మందు బాటిల్‌ ఖాళీ కావాల్సిందే.. కానీ ఇప్పుడు!.. ఆమిర్‌ ఖాన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Aamir Khan
Follow us

|

Updated on: Mar 16, 2022 | 10:22 AM

ఆమిర్‌ ఖాన్‌.. బాలీవుడ్‌లో మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌గా పేరున్న ఈ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిందీ చలన చిత్ర పరిశ్రమలో టాప్‌ హీరోగా వెలుగొందుతోన్న ఆయనకు తెలుగులోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు. కాగా నాలుగేళ్ల క్రితం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ సినిమాతో అభిమానులను పలకరించిన ఆమిర్‌ ఖాన్ (Aamir Khan) త్వరలోనే లాల్‌ సింగ్‌ చద్దా (Laal Singh Chaddha)గా రానున్నాడు. ఇందులో టాలీవుడ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షుకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇటీవల 57వ వసంతంలోకి అడుగుపెట్టాడు ఆమిర్‌ ఖాన్‌. ఈ సందర్భంగా తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

‘నేను ఇంతకుముందు డ్రింక్‌ చేసేవాడిని. అయితే అప్పుడప్పుడు మాత్రమే. కొంతమంది రెండు పెగ్గులు తీసుకుంటారు. మరికొంతమంది తరచూ తాగుతుంటారు. కానీ నేను మాత్రం అకేషనల్‌గా తాగేవాడిని. కాకపోతే తాగడానికి కూర్చున్నప్పుడు బాటిల్‌ మొత్తం పూర్తి చేసేవాడిని. ఎందుకో అది కరెక్ట్‌ కాదనిపించింది. మనం సొంత నియంత్రణను కోల్పోవడమనేది నాకు అసలు నచ్చలేదు. అందుకే ఇకపై ఎప్పుడూ మందు ముట్టుకోకూడదని నిర్ణయించుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు ఆమిర్‌. కాగా ఇటీవల వివాహం, విడాకులపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలిచాడీ టాప్‌ హీరో. ‘నేను చిత్ర పరిశ్రమలో చేరినప్పుడు నాకు 18 ఏ‍ళ్లు. నేను చాలా విషయాలు నేర్చుకుని ఎన్నో చేయాలనుకున్నాను. అయితే అనుకున్నవి చేయలేకపోయాను. ఇక నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు, నా మొదటి భార్య రీనా, ఆమె తల్లిదండ్రులు, రెండో భార్య కిరణ్‌, తన తల్లిదండ్రులు, నా పిల్లలు వీళ్లందరూ నాకు చాలా సన్నిహితులు. వారికి తగిన సమయం ఇవ్వలేకపోయానని అప్పుడప్పుడు నాకు అనిపిస్తోంది’ అని అమిర్‌ చెప్పుకొచ్చారు.

Also Read:Holi 2022: హోలికా దహనం రోజున ఈ పనులు అస్సలు చేయకూడదు.. పొరపాటున మార్చిపోతే అశుభమే..

Parineeti Chopra: ఏ లుక్ లో అయిన నేనే క్యూట్ అంటున్న పరిణీతి.. లేటెస్ట్ స్టన్నింగ్ ఫోటోస్ వైరల్

Inter Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పు..? మేలో నిర్వహించే ఛాన్స్..?