Watch Video: సల్మాన్ ఖాన్ ఇంటిలోకి అనుకోని అతిథి.. హడలిపోయిన ఫ్యాన్స్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద సోమవారం (మే 18) సాయంత్రం పాము కలకలం సృష్టించింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఆయన ప్రసిద్ధ గెలాక్సీ అపార్ట్‌మెంట్ ఆవరణలో సుమారు ఐదు అడుగుల పొడవున్న పాము ప్రత్యక్షం కావడంతో అక్కడి భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Watch Video: సల్మాన్ ఖాన్ ఇంటిలోకి అనుకోని అతిథి.. హడలిపోయిన ఫ్యాన్స్!
Snake At Salman Khan Galaxy Apartment

Updated on: May 19, 2026 | 10:34 AM

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద సోమవారం (మే 18) సాయంత్రం పాము కలకలం సృష్టించింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఆయన ప్రసిద్ధ గెలాక్సీ అపార్ట్‌మెంట్ ఆవరణలో సుమారు ఐదు అడుగుల పొడవున్న పాము ప్రత్యక్షం కావడంతో అక్కడి భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

గెలాక్సీ అపార్ట్‌మెంట్ పరిసరాల్లోని కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఒక షట్టర్ లోపల ఈ పాము దాక్కున్నట్లు గుర్తించారు. అపార్ట్‌మెంట్ వద్ద డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మనోజ్ కాటే అప్రమత్తమై, వెంటనే స్నేక్ రెస్క్యూ నిపుణుడు విక్కీ దూబేకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న విక్కీ దూబే, చాకచక్యంగా ఆ పామును బంధించారు.

ఆ పాము ‘ధమణ్’ (Rat Snake) జాతికి చెందినదని రెస్క్యూ ఆపరేషన్ తర్వాత అధికారులు వెల్లడించారు. ఇది సుమారు ఐదు అడుగుల పొడవు ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా, ఈ రకం పాములు విషరహితమైనవి. ఇవి సాధారణంగా ఎలుకలను వేటాడుతుంటాయని తెలిపారు. పామును పట్టుకున్న అనంతరం, దానికి ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనపై బాంద్రా వెస్ట్ పోలీసులు స్టేషన్ డైరీలో వివరాలను నమోదు చేయడంతో పాటు, అటవీ శాఖ కంట్రోల్ రూమ్‌కు కూడా అధికారికంగా సమాచారం అందించారు.

సల్మాన్ ఖాన్ నివాసం వద్ద ఇప్పటికే భారీ భద్రత ఉండగా, ఈ పాము వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో కూడా సల్మాన్ ఖాన్‌ను తన ఫామ్‌హౌస్‌లో ఒక పాము కరిచిన సంగతి తెలిసిందే, అయితే అప్పుడు కూడా అది విషరహిత పాము కావడంతో ఆయన త్వరగానే కోలుకున్నారు. ప్రస్తుత ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us