Bigg Boss Season 6: సండే అంటే ఫన్‌డే.. కంటెస్టెంట్‌లతో ఆటాడుకున్న నాగ్‌.. వీకెండ్ ప్రోమో అదిరిపోయిందిగా..

Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ తెలుగు 6వ సీజన్‌ మొదలై విజయవంతంగా వారం పూర్తి చేసుకుంది. ఇప్పటికే శనివారం జరిగిన వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగ్ హంగామా చేసిన విషయం తెలిసిందే. ఇక 6వ సీజన్‌లో తొలి ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది...

Bigg Boss Season 6: సండే అంటే ఫన్‌డే.. కంటెస్టెంట్‌లతో ఆటాడుకున్న నాగ్‌.. వీకెండ్ ప్రోమో అదిరిపోయిందిగా..
Biggboss File Photo

Updated on: Sep 11, 2022 | 6:07 PM

Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ తెలుగు 6వ సీజన్‌ మొదలై విజయవంతంగా వారం పూర్తి చేసుకుంది. ఇప్పటికే శనివారం జరిగిన వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగ్ హంగామా చేసిన విషయం తెలిసిందే. ఇక 6వ సీజన్‌లో తొలి ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. హౌజ్‌ నుంచి తొలి కంటెస్టెంట్‌ను సాగనంపనున్నారు. ఇక హౌజ్‌మేట్స్‌ మధ్య ఇప్పటికే గొడవలు, గోలలు మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి వీకెండ్‌ ఎపిసోడ్‌లో హౌజ్‌మేట్స్‌కు పలు సూచనలు కూడా ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఆదివారం ఎపిసోడ్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా కనిపిస్తోంది. బిగ్‌బాస్‌ నిర్వాహకులు విడుదల చేసిన తాజా ప్రోమో విషయాన్ని చెప్పకనే చెబుతోంది. సండే అంటే ఫన్‌డే అంటూ ఆటలు, పాటలు.. మధ్యలో ఎలిమినేషన్‌ అంటూ నాగ్‌ ఎపిసోడ్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా నాగ్‌ కంటెస్టెంట్‌తో ఓ వెరైటీ ఆట ఆడుకున్నాడు. ‘ఎవరికి ఎంత తెలుసు’ అనే గేమ్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘శ్రీహాన్‌ హౌజ్‌లో మొదట ఏ ప్లేస్‌కు వెళ్లాడు’.? ‘ఆర్‌జే సూర్య ఎంత మందిని మిమిక్రీ చేయగలడు.?’ లాంటి ఫన్నీ ప్రశ్నలు వేశారు.

ఇవి కూడా చదవండి

ఇలా ఈరోజు ఎపిసోడ్‌ అంతా సందడి సందడిగా సాగేలా కనిపిస్తోంది. మరి ఈరోజు హౌజ్‌ నుంచి ఎవరు ఎలిమినేట్‌ అవుతున్నారు.? ఇంకెలాంటి రచ్చకు దారి తీయనుందన్న విషయం తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయ్యేవరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..