Bigg Boss 10 Telugu : ఇంత వరస్ట్ ఏంట్రా బాబూ.. పిచ్చెక్కినట్లు ప్రవర్తించిన షాలిని.. నెటిజన్స్ కామెంట్స్ చూస్తే..

షాలిని.. ఈ సీజన్ మొత్తంలోనే ఎన్నోసార్లు బిగ్ బాస్, నాగార్జున చేత చివాట్లు తిన్న కంటెస్టెంట్స్. అయినప్పటికీ తీరే మారలేదు. ఇక ఎలిమినేషన్ అని నాటకమాడి మరీ సీక్రెట్ రూంలోకి పంపించాడు బిగ్ బాస్. ఇక తర్వాత హౌస్ లోకి వచ్చి మారింది ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు మరింత ఓవరాక్టింగ్ చేయడమే పనిగా మారింది. ప్రతి చిన్న విషయానికి నానా రచ్చ చేసి హంగామా సృష్టిస్తుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో షాలిని పూర్తిగా పిచ్చెక్కినట్లు ప్రవర్తించింది.

Bigg Boss 10 Telugu : ఇంత వరస్ట్ ఏంట్రా బాబూ.. పిచ్చెక్కినట్లు ప్రవర్తించిన షాలిని.. నెటిజన్స్ కామెంట్స్ చూస్తే..
Shalini And Debjani Modak Fight

Updated on: Oct 24, 2026 | 3:45 PM

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతూ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న గొడవలు షోపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. తాజాగా విడుదలైన బిగ్‌బాస్ ప్రోమోలో కంటెస్టెంట్లు షాలిని , దేబ్జానీ మోదక్ మధ్య బెడ్స్ , బట్టల సర్దుబాటు విషయంలో జరిగిన గొడవ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం, హౌస్‌లో షాలినికి కేటాయించిన బెడ్ రూమ్ పనుల విషయంలో వివాదం చెలరేగింది. దేబ్జానీ బెడ్‌పై బట్టలు చిందరవందరగా పడేసింది షాలిని. అలాగే బెడ్ రూం పనులు చేయాల్సింది కూడా షాలిని కావడంతో తన బెడ్ పై ఉన్న బట్టలు సర్దేయాల్సిందిగా దేబ్జానీ ఎంతో పద్ధతిగా షాలినిని కోరింది. కానీ షాలిని తర్వాత చేస్తాను.. ఇప్పుడు నువ్వు పడుకోవం లేదు కదా అంటూ ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయింది. “ఇప్పుడే పడుకుంటావా? టైమ్ పడుతుందిగా” అంటూ షాలిని ఎదురు తిరగగా, “నా బెడ్ క్లీన్‌గా ఉండాలి, అది నీ డ్యూటీ” అంటూ దేబ్జానీ గట్టిగా నిలదీసింది.

“నువ్వు చెప్తే అసలు చేయను, ఏం చేసుకుంటావో చేసుకో” అంటూ షాలిని మరింత రెచ్చిపోవడంతో హౌస్‌లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. దేబ్జానీ ఎంత పద్దతిగా అడిగినప్పటికీ షాలిని మాత్రం పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తూ హౌస్ అంతా తిరుగుతూ నానా రచ్చ చేసింది. అసలు పాయింట్ లేకుండా గట్టి గట్టిగా అరవడమే పనిగా పెట్టుకున్నారు రోహిత్, షాలిని. గత వారం హోస్ట్ నాగార్జున బట్టలు ఎక్కడపడితే అక్కడ పడేయొద్దని, ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలని క్లాస్ పీకినప్పటికీ, హౌస్‌మేట్స్‌లో మార్పు రాలేదని ఈ గొడవ ద్వారా స్పష్టమవుతోంది. షాలినికి తోడుగా ఆమెకు వత్తాసు పలుకుతూ రోహిత్ కూడా ఈ వాదనలో భాగం కావడంతో హౌస్‌లో మరోసారి గ్రూప్ గొడవలు తెరపైకి వచ్చాయి.

బెడ్ అస్సలు సరి చేయను అంటూ ఇష్టమొచ్చినట్లు వాగి ఎప్పటిలాగే రోహిత్ తో కలిసి బెడ్ ఎక్కేసింది షాలిని. ఇక ఇద్దరూ కలిసి దేబ్జానీ గురించి ముచ్చట్లు పెట్టుకున్నారు. వారమంతా ప్రశాంతంగా సాగుతుందనుకున్న సమయంలో గొడవ పెట్టేసిందని షాలిని అనడంతో.. అసలు ఆమెకు ఏం కావాలి అంటూ రోహిత్ సైతం వత్తాసు పలికాడు. దీంతో షాలిని తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మరీ నాగార్జున వచ్చి షాలినికి ఎలాంటి క్లాస్ తీసుకుంటారో చూడాలి.

ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..

బిగ్ బాస్ ప్రోమో..

ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‏తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..

Loading...
Unable to load recommendations.
Follow Us