నాకు ఇంకో జాబ్‌ ఏమైనా ఉందా!

కరోనా నేపథ్యంలో 65ఏళ్లు పైబడిన వారు షూటింగ్‌ల్లో పాల్గొనకూడదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆ మధ్యన ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.

నాకు ఇంకో జాబ్‌ ఏమైనా ఉందా!

Updated on: Aug 10, 2020 | 2:28 PM

Amitabh Bachchan on shootings: కరోనా నేపథ్యంలో 65ఏళ్లు పైబడిన వారు షూటింగ్‌ల్లో పాల్గొనకూడదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆ మధ్యన ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సీనియర్ నటుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సీనియర్ సిటిజన్‌లు షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు అనుమతిని ఇచ్చింది. ఈ సందర్భంగా పలువురు నటులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో తనకు పని దొరుకుతుందో లేదోనని ఆవేదనకు గురైనట్లు అమితాబ్ వెల్లడించారు. ”ఆ సమయంలో నా మెదడు ఆందోళనకు గురైంది. 65ఏళ్లు పైబడిన వారు షూటింగ్‌లో పాల్గొనకూడదు అంటే నా లాంటి వాళ్లు అన్నీ సర్దుకోవాల్సిందే. ఇది కాకుండా నాకు మరో జాబ్ ఏమైనా ఉందా..!” అని పలు ఆలోచనలు వచ్చినట్లు బిగ్‌బీ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కాగా దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ ఆయనకు జాబ్ ఆఫర్ చేశారు. ఆ విషయాన్ని తన బ్లాగుల్లో తెలిపిన అమితాబ్‌.. ”ఇప్పుడు నాకు ఉద్యోగం దొరికింది” అని రాసుకొచ్చారు.

Read This Story Also: సుశాంత్ కేసు.. రెండోసారి ఈడీ ముందు హాజరైన రియా!

Loading...
Unable to load recommendations.
Follow Us