
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి కొవిడ్ బారిన పడ్డారు. ఇప్పటికే రెండు సార్లు కరోనా బారిన పడి కోలుకున్న ఆయన మళ్లీ మహమ్మారి చేతికి చిక్కారు. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తన కరోనా రిపోర్టును ట్విట్టర్లో షేర్ చేస్తూ ‘గత మూడు రోజులు నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు(ఆదివారం) సాయంత్రం పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణైంది. నాకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. నా కుటుంబ సభ్యులకు నెగెటివ్ వచ్చింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేయాలనుకునేవారు ఒకసారి ఆలోచించుకోండి. ప్రస్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. ధన్యవాదాలు.. క్షేమంగా ఉండండి’ అని బండ్ల గణేష్ తన ట్వీట్లో తెలిపారు.
కాగా బండ్ల గణేష్ ప్రతీ వేవ్‌లో కరోనా బారిన పడుతున్నారు. మొదటి వేవ్‌లో కరోనా బారిన పడిన ఆయన త్వరగానే కోలుకున్నారు. కానీ రెండో వేవ్ సమయంలో మాత్రం గణేష్ ఆరోగ్య పరిస్థితి బాగా దిగజారింది. ఆ సమయంలో ఐసీయూలో చికిత్స అనంతరం కోలుకోవాల్సి వచ్చింది. తాజాగా మూడోసారి కరోనాకు చిక్కారు. మరోవైపు టాలీవుడ్‌కి చెందిన పలువురు సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. నేడు (జనవరి9) రాజేంద్రప్రసాద్, విష్ణువిశాల్, త్రిష, థమన్, మహేష్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, విశ్వక్ సేన్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కరోనా బాధితుల జాబితాలో చేరారు.
Also Read:
Coronavirus: సుప్రీంకోర్టును తాకిన కరోనా.. ఏకంగా 150 మంది పాజిటివ్..
RRR: ఇంకా క్రేజ్ తగ్గని ‘నాటు నాటు’.. బ్లాక్ అండ్ వైట్ సినిమాకు ఎలా రీమిక్స్ చేశారో చూడండి..
Covid Vaccine: తెలంగాణలో రేపటి నుంచి ఉచితంగా కొవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సిన్.. ఎవరెవరు అర్హులంటే..