హిట్ టైటిల్స్.. సినిమాకు ప్లస్సా..? మైనస్సా..?

హిట్ టైటిల్స్.. సినిమాకు ప్లస్సా..? మైనస్సా..?

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రేజీ కాంబినేషన్‌లో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీపై ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకోవడంతో గ్యాంగ్ లీడర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ మూవీతో ఈ ఏడాది మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు నాని. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 14, 2019 | 9:29 PM

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రేజీ కాంబినేషన్‌లో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీపై ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకోవడంతో గ్యాంగ్ లీడర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ మూవీతో ఈ ఏడాది మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు నాని. మరోవైపు ‘హలో’ మూవీ పరాజయంతో కాస్త ఢీలా పడ్డ విక్రమ్ కుమార్ ‘గ్యాంగ్ లీడర్‌’తో హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు.

అయితే ఈ మూవీకి ‘గ్యాంగ్ లీడర్’ పెట్టడంపై అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం గ్యాంగ్ లీడర్ పేరును నాని తీసుకోవడంపై మెగాభిమానులు ఓరేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా నానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసిన వారు టైటిల్ మార్చుకోవాలంటూ డిమాండ్ చేశారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఈ తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇక టైటిల్‌ విషయంలో మెగా కాంపౌండ్ నుంచి కూడా నానికి మద్దతు వచ్చిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక నాని కూడా ఈ టైటిల్ వివాదంపై ఓ సారి మాట్లాడుతూ.. తాను చిరంజీవికి పెద్ద అభిమానిని అని.. ఆయన టైటిళ్ల పేర్లను చెడగొట్టాలని తాను అనుకోనని తెలిపాడు.

అయితే టాలీవుడ్‌లో టైటిల్స్ రిపీట్ అవ్వడం కొత్తేం కాదు. ఒకప్పుడు ఘన విజయం సాధించిన మూవీ టైటిల్స్‌ను ఆ తరువాత ఎంతోమంది హీరోలు వాడుకున్నారు. వీరిలో టాప్ హీరోలు కూడా ఉన్నారు. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారు ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన హిట్ చిత్రాల టైటిల్స్‌ను వాడుకున్నారు. కొన్ని బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ.. కొన్ని మాత్రం అట్టర్ ఫ్లాప్‌లుగా నిలిచాయి. వాటిలో క్లాసిక్ టైటిల్స్ కూడా ఉన్నాయి. దీంతో ఏదైనా టైటిల్‌ను రిపీట్ చేసేటప్పుడు ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. హిట్ టైటిల్స్‌ను పెట్టి వాటి పేరును చెడగొడుతుంటారని కొందరు వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంటారు.

ఉదాహరణకు చూస్తే.. మల్లీశ్వరి, దేవుడు చేసిన మనుషులు, శ్రీమంతుడు, మహర్షి, దేవదాసు, మిస్సమ్మ, మాయా బజార్, శంకరాభరణం, ప్రేమ, పూల రంగడు, అడవి రాముడు, ఇద్దరు మిత్రులు, పిల్ల జమిందార్, గీతాంజలి, గణేష్, దొంగాట, అహ నా పెళ్లంట, అప్పు చేసి పప్పు కూడు, మోసగాళ్లకు మోసగాడు, తొలి ప్రేమ, ఆరాధన, పవిత్ర బంధం, దొంగ రాముడు, రాక్షసుడు, జంటిల్‌మన్ వంటి చిత్రాల టైటిల్స్‌ టాలీవుడ్‌లో రిపీట్ అయ్యాయి. వాటిలో చాలా తక్కువ మాత్రమే విజయాన్ని సాధించాయి. మాయా బజార్, శంకరాభరణం, అహ నా పెళ్లంట, దేవుడు చేసిన మనుషులు వంటి క్లాసిక్ టైటిల్స్‌తో వచ్చిన మూవీలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూశాయి. అలాగే తొలి ప్రేమ, రాక్షసుడు, గీతాంజలి, ప్రేమ, మల్లీశ్వరి వంటి చిత్రాలు మంచి విజయాన్నే సాధించాయి. అందువల్లనే సినిమా టైటిళ్లపై కూడా ప్రతి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వివాదాలే నడుస్తుంటాయి. ఏదేమైనా.. టైటిల్ ఏదైనా.. కథలో దమ్ము లేకపోతే.. క్లాసిక్ టైటిల్స్ కూడా పరాజయాన్ని చూస్తాయన్నది కొందరి అభిప్రాయం. ఇదంతా పక్కనపెడితే అప్పట్లో చిరంజీవికి హిట్ ఇచ్చిన గ్యాంగ్ లీడర్.. ఇప్పుడు నానికి ఎలాంటి ఫలితం ఇవ్వబోతోందో మరికొన్ని గంటల్లో తేలనుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu