
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటన, గ్లామర్ , లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. ‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ స్వీటీ, తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ చాలా గోప్యంగా ఉంచుతారు. అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న తన చిన్ననాటి తొలి ప్రేమ జ్ఞాపకం నెట్టింట వైరల్‌గా మారింది. తన మొదటి ప్రేమ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ అనుష్క ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ఆమె 6వ తరగతి చదువుతున్న సమయంలో ఒక అబ్బాయి వచ్చి ఆమెకు నేరుగా “ఐ లవ్ యు” అని చెప్పాడట. ఆ వయసులో తనకు “ఐ లవ్ యు” అంటే అసలు అర్థం ఏమిటో కూడా తెలియదని, దాంతో అమాయకంగా “సరే” అని సమాధానం ఇచ్చానని నవ్వుతూ చెప్పారు. ఆ సంఘటన తన జీవితంలో అత్యంత అమాయకమైన, అందమైన జ్ఞాపకంగా నిలిచిపోయిందని ఆమె పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..
40 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్ళి చేసుకోకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో తరచూ అనేక పుకార్లు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పాన్-ఇండియా స్టార్ హీరోతో ఆమె ప్రేమలో ఉందంటూ వస్తున్న వార్తలపై ఇద్దరూ పలుమార్లు స్పష్టత ఇచ్చారు. తామిద్దరం మంచి స్నేహితులమని, అనుబంధం ఏదైనా ఉంటే దాచిపెట్టే రకం కాదని తేల్చి చెప్పారు. అనుష్క మాటల్లో – “వివాహం అనేది చాలా పవిత్రమైన బంధం. ఇద్దరు వ్యక్తులు కలసి ఎదిగేందుకు అది సరైన వేదిక అని అన్నారు. సరైన వ్యక్తి ఎదురైనప్పుడు సహజంగానే పెళ్ళి జరుగుతుంది. నా పెళ్ళి విషయాన్ని నా తల్లిదండ్రులకే వదిలేశాను. పెళ్ళి కుదిరిన రోజున తప్పకుండా అందరికీ బహిరంగంగానే తెలియజేస్తాను.” అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..
సినిమా రంగంలోకి రాకముందు ముంబైలో యోగా శిక్షకురాలిగా పనిచేసిన అనుష్క, ‘సూపర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. 15 ఏళ్ళకు పైగా సినీ ప్రయాణంలో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, విలక్షణ నటనతో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. సోషల్ మీడియా, మీడియా హంగామాకు దూరంగా ఉండే ఆమె, తన వ్యక్తిగత జీవితంపై వచ్చే అనవసరపు రూమర్లను పెద్దగా పట్టించుకోనని వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..
ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..